****
" హన్నా! గాడు ఎన్ని శకలు పడ్డడవ్వా! తల్సుకుంటే నేనేనా గాని ఎత్తులు జిత్తులన్ని పశిగట్టింది. గిప్పటికీ గా యిష్యం మన్సుల బడితే ఆచ్చిరంగ ఉంటది."
సైన్మా కట్టాలన్నీ శెప్తుంటే ఇంట్లె మీ మర్థి పెద్దోడు,శిన్న ది, యత్త ఇంట్లో ఎవలో పోయినట్టు వల్లవల్ల ఏడ్శిండ్రు. నాకు సుత ఏడుపొచ్చింది గని లోపలెక్కడో గాడి మాటల్ల తేడా అన్పిచ్చింది.
గింతకీ ఎవలు శెల్లే! గంతగనం మీ ఇంటోళ్ళందర్ని ఏడిపిచ్చింది. ఏం జర్గిందంట? గింతకీ గా వొచ్చినోడు దేనికోసం వచ్చిండు శెల్లే?"
"ఎందుకొత్తడవ్వా! మనల్ని బురిడీ కొట్టించి మన తాన ఏమున్నయో దొబ్బుక పోదమని వచ్చిండు.సూత్తె మడిషి అమాయికంగ శెప్పేయన్ని నిజమే అన్నట్టు శెప్పిండవ్వా!"
గాని అమ్మకి ఆయాస రోగమంట, అయ్యకి రొండు కిడ్డీలు శెడిపోయినయంట. అక్క అవుడుదట, శెల్లె గుడ్డిదట.ఇల్లెడు బాద్దెత తన మీదనే ఉందట.గాల్ల రోగాలు నొప్పులకి అడ్విల పొలం అమ్మి పెడ్తుండంట. ఇంక శానా ఎకరాల భూవి ఉందట. దాంట్లె రొండెకరాలు అమ్మకానికి పెట్టిండంట.శానా సౌకగొత్తది కొనుండ్రి. అవుసరానికని బంగారమస్మంటి భూవి నమ్ముతున్న.ముందుగాల వో రెండు లచ్చలు బయాన ఇయ్యుండ్రి.మా నాయిన సావు బత్కులున్నడు" అని పట్ట వొయ్యిని పట్టుకొచ్చిండు అవ్వా! "
" మీరు సుత ఎప్పన్నించో అడ్విల గింత బూవి వుంటే బావుండని అన్కోబడితిరి గద శెల్లే! సౌకగొత్తుందేమో కొన్రాదురి."
"ఓ అవ్వా ! అసలాన్ని నీ తానికి పంపిత్తే ఎగ్రి గంతేశి కొందువా ఏంది? గా పొలం యాడుందో తెల్సా గాడు వుండే షిరిడీ కాడనంట.యాడుంటేంది మీ పేర్న శేత్త అంటుండు.గందులో పేరు గీని పేరు గాదు.గదేందని గట్టిగ గద్రాయిచ్చి అడ్గితే నీళ్ళు నవలబట్టిండు."
"గంతే గాదవ్వా! గా పట్ట వొయ్యిని నమ్మకం లేకపోతే మీ తాన్నే ఉంచుకోండి అంటుండు.దూరపు సుట్టాన్వి గాబట్టి గీ రెండు దినాలు కడ్పునిండ తిండి బెట్టి మర్యాజ్జేసినం. మా తాన పైసా లేదు అంటే ఉన్నయని భూవి కొంటమని తమ్ముడు శెప్పిండు అంటడు. గిదేదో తేడాగ ఉందనిపిచ్చి గాన్ని ఎట్దైన ఎల్ల గొట్టాలని సూశినం."
అయితే " గా పప్పు ఈ నీళ్ళకి ఉడకలేదన్న మాట"."
" ఉడ్కుడా! ఇంకేమన్ననా! ఎట్లుడుక నిత్తవ్వా! గా వొచ్చినోడు ముప్పూట్ల పొట్లెంగ తినుడు.కల్లబొల్లి మాటలతో మాయ జేస్కుంట ఇంట్లెనించి కదుల్డు లేదు. ఎట్లనన్న మనతో కొనిపియ్యాలని సూత్తావుండు."
" మా శిన్నత్త కొడుకు పోలీసు.సాటుంగ యిష్యం జెప్పిన.గా పట్టా వయ్యి నకలు దీస్కొని తెల్సుకొమ్మని శెప్తే వీడి బండారమంత బయట పడింది.సుట్టపోడే గని గీ నడ్మల దొంగతనాలు నేర్శిండట. శివరాకరికి గాన్ని పోలీసులు వొచ్చి పట్క పోయిండ్రవ్వా!"
" గాడు గిన్ని ఎదవ ఏశాలు ఏశిండన్న మాట. మొత్తానికి "ఆ పప్పులేం ఉడకవని" తెల్శేటట్టు సేశిండ్రు శెల్లే! గీ దినాల్లో మంచి తెల్వితేటలు, డబ్బున్నోళ్ళను పట్టుకొని గాళ్ళు జెల్సా శేత్తుండ్రు. శెల్లే!నీ తెల్వి తేటల్ని సూత్తుంటె శానా సంబురంగ ఉంది."
గదండీ సంగతీ!; ఆ పప్పు ఈ నీళ్ళకు ఉడకదు/ ఆ పప్పు లేం వుడకవు" అంటే గిదే మరి.గస్మంటి మోసగాళ్ళ మన పప్పులు ఉడ్కినయంటే మనం నిండా మునగడమే..గందుకే ఆళ్ళ పప్పులు మన నీళ్ళకి ఉడకనీయ కూడదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి