ఓ విశ్వామిత్ర నా మాట వినుము
కామదేనువే నాకు జీవనాధారం
దానికి నాకు విడదీయలేని బంధం
పాలు పెరుగు నెయ్యి ఇస్తూ ఆకలి తీర్చను
సాయంకాల సమయమునందు
చేయునట్టే హోమములకు, భూతల్లికి
అగ్ని కార్యములకు పాలు పెరుగు నెయ్యి
ప్రేమతో అందిస్తుంది కామదేనువు
పెక్కు కారణములచే నేను ఇవ్వలేను
మీకు కోటి ఆవులను కొట్టిస్తాను
వెయ్యికోట్ల ఏనుగులను మీకిస్తాను
రత్న రాశులను స్వర్ణ రథములనిస్త
కామదేవును నాకు ఇవ్వు వశిష్ట
దాన్ని వదిలి నేను ఉండలేను స్వామి
నన్ను వదిలి కామదేను నుండదు
అన్ని తెలిసి అడుగుట ధర్మము కాదూ
విశ్వామిత్రుడు కోపముతో పట్టు వదలడు
సదా కార్యములను నెరవేర్చి దేవత
ధర్మంతో కూడిన యజ్ఞములకు
ఈ కామదేనువ్వే ఆధారం
ఈ దివ్యదేనువు నేనివ్వను స్వామి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి