క్రిశంకుడు చండాలత్వమును పొందుట :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
రామా త్రిశంకుని మాటలు విన్న 
వశిష్ట పుత్రులు మిక్కిలి క్రోధులై 
మా తండ్రి మాటలు పెడచెవిన పెట్టి 
ఆయన పుత్రులమైన మా వద్దకొచ్చావా

ఇక్ష్వాక వంశానికి మా తండ్రి పురోహితుడు 
మేము అతడు చెప్పిన మాటలు కాదని 
నీతో యజ్ఞయాగాలు ఎలా చేపిస్తాము 
దివికేగుట సాధ్యము కాదని తెలిపాడు కదా 

తండ్రి మాట కాదని నీతో యజ్ఞం జరిపించి 
ఆయనను అవమానింపగలేము
వారి మాటలని త్రిశంకుడు ఇలా అంటాడు 
మీరు కూడా నన్ను తిరస్కరించారు కదా 

నేను మరో తపమహర్షిని చూసుకుంటాను 
వశిష్టుని మాట కాదని నీవెలా వెళ్తావు 
ఆ మహర్షి పుత్రులు మిక్కిలి కోపంతో 
చండాలత్వము పొందుమని శపించారు 

త్రిశంఖుని శపించి ఆ మహాత్ములు 
ఆశ్రమమునకు చేరి సేదతీరినారు 
శాప వచనములు విని త్రిశంకుడు 
బాధతో తన నగరమునకు చేరినాడు 


కామెంట్‌లు