క్షీరసాగర మథనం :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
విశ్వామిత్రుడు  మునీశ్వరులతో 
రామలక్ష్మణులతో నది దాటినారు 
వారంతా ఉత్తర తీరము చేరినారు 
నావ పంపిన వారికి నమస్కరించినారు 

వారు విశాల నగరం చేరినారు 
విశ్వామిత్రుడు శ్రీరామునితో ఆ నగరము గూర్చి 
అచ్చటి రాజుల గూర్చి వివరించాడు 
విను రామా దేవేంద్రుని కథను వివరించెద 

పూర్వము కృతయుగము నందు 
దీతిపుత్రులు శక్తివంతులుగా యుండిరి
అదితి కుమారులు ధర్మబుద్ధి తోం 
మహా పరాక్రమ శాలురుగను యుండిరి 

ఒక సమయం ముందు దేవతలకు 
దైత్యులకును ముసలి తనము 
రోగాలు మరణము లేకుండా ఉండుటకు 
వారంతా యోచన చేయుచుండిరి 

క్షీర సాగరము మథించి దాని నుండి వచ్చిన 
అమృతమును పొందుటకు యోచించినారు
మందర పర్వతమునకు వాసుకిని 
తాడుగా చుట్టి క్షీరసాగరము చిలికినారు


కామెంట్‌లు