ఎండాకాలం వచ్చిందా...మండే ఉష్ణోగ్రత హెచ్చిందా..సూర్యుడి ప్రతాపంతో..భగభగ మండే ఎండలతో..గ్రీష్మ తాపంతో..వేడెక్కిన సెగలతో ..భూగోళం దద్దరిల్లుతుంటే ..దాహార్తితో జీవరాశి తహతహలాడుతూ...వడదెబ్బకు అసువులు బాసేదయనీయ పరిస్థితి...!దాహార్తితో అలమటించే జన జీవనం...దాహం తీర్చుకునే వేళ..చల్లని మధుర రసాలకై.. ఆరులు చాచుట...చల్లని పానీయాలు .. తనువుకు పులకింత...చల్లని మజ్జిగ,చెరుకు రసం, సబ్జా,బార్లీ ,సోడు జావా,రాగిజావా..లాంటి మేలైన పానీయాలనే సేవించవలె .శరీరానికి హాని కలిగించే రసాయన పానీయాలను నిరోధించే వలె.మనిషి సేదదీరే చలువ రసాలే శ్రేష్టమైన చల్లని పానీయాలు.!********
సేదదీర్చే చల్లని రసాలు. : - తాతోలు దుర్గాచారి.-తెలంగాణ సాహితి -భద్రాచలం శాఖ.
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి