ఆమె 70,000 మంది శిశువులకు జన్మనిచ్చారు. 1.5 లక్షల శస్త్రచికిత్సలు చేశారు. ఎలాంటి రుసుము తీసుకోలేదు | వైద్య వృత్తిని ఒక ఉద్యమంగా మార్చిన ఇండోర్ ‘డాక్టర్ దాదీ’ కథ.
అమ్మాయిల చదువునే నిరుత్సాహపరుస్తున్న కాలంలో, ఉజ్జయిన్ జిల్లాలోని మహిద్‌పూర్‌లో 1926 ఏప్రిల్ 3న జన్మించిన ఒక యువతి, డాక్టర్ కావాలని కలలు కనడానికి సాహసించారు. ఆమె పేరే డాక్టర్ భక్తి యాదవ్. ఈమె ఆ తర్వాత ఇండోర్ లో మొట్టమొదటి మహిళా ఎంబిబిఎస్ MBBS డాక్టరుగా, ఎంజిఎం MGM మెడికల్ కాలేజీలోని తన మెడికల్ బ్యాచ్‌లో ఏకైక మహిళగా, మధ్య భారతదేశంలోని మార్గదర్శక మహిళా వైద్యులలో ఒకరిగా నిలిచారు.
సుఖవంతమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని ఎంచుకోకుండా, ఆమె భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఆమె తనకొచ్చిన ఆఫర్లను తిరస్కరించి పేద మిల్లు కార్మికుల భార్యలకు సేవ చేస్తూ నందలాల్ భండారీ ప్రసూతి గృహంలో చేరారు. ఆ తర్వాత తన భర్త డాక్టర్ సి.ఎస్. యాదవ్‌తో కలిసి వాత్సల్య నర్సింగ్ హోమ్‌ను స్థాపించారు.
1948 నుండి, వైద్యం ఒక వ్యాపారం కాదని, అది ఒక సేవ అని నమ్మి, ఆమె రోగులకు ఉచితంగా చికిత్స అందించడం మొదలుపెట్టారు.
ఆమె సాధించిన గణాంకాలు దాదాపు నమ్మశక్యం కానివిగా అనిపిస్తాయి. కానీ యదార్థం. 70,000కు పైగా శిశువులకు జన్మనిచ్చారు. దాదాపు 1.5 లక్షల శస్త్రచికిత్సలు నిర్వహిం చారు. అదే సమయంలో లెక్కలేనంత మంది పేద మహిళలు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఆమె వద్ద చికిత్స పొందారు.
మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ నలుమూలల నుంచి రోగులు, తాము ప్రేమగా "డాక్టర్ దాదీ" అని పిలుచుకునే ఆవిడను కలవడానికి వచ్చేవారు.
ఆమె ప్రయాణం సులభమైనది కాదు. మహిళలు వైద్యరంగంలోకి ప్రవేశించడం అరుదుగా ఉన్న కాలంలో ఆమె చదువుకున్నారు, నిరాడంబరం గా జీవించారు. ఆరోగ్యం క్షీణిస్తున్న ప్పటికీ వృద్ధాప్యంలో కూడా పని చేశారు. ఆమె తన 90వ ఏట వరకు రోగులకు సేవ చేస్తూనే వచ్చారు.
గుర్తింపు ఆలస్యంగా వచ్చింది, కానీ వైద్యానికి, మానవాళికి ఆమె చేసిన అసాధారణమైన సేవకు గాను 2017లో పద్మశ్రీతో సత్కరించారు.
డాక్టర్ భక్తి యాదవ్ 14 ఆగస్టు 2017న కన్నుమూశారు, కానీ ఆమె స్పృశించిన పది వేల మంది తల్లులు, పిల్లలు, కుటుంబాల జీవితాలలో ఆమె వారసత్వం జీవిస్తూనే ఉంది. ఆమె ఒక సామ్రాజ్యాన్ని నిర్మించలేదు, ఆమె నమ్మకాన్ని, కరుణను, భారతదేశపు నిస్వార్థ సేవకు గొప్ప ఉదాహరణలలో ఒక దాన్ని నిర్మించారు.
డాక్టర్ భక్తి యాదవ్ వంటి వారి కథలను పాఠశాలలు, వైద్య కళాశాలల్లో తప్పక బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి