ఇంద్రుడు ఆమె గర్భ శిశువును ఏడు ముక్కలు చేయుట : -ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
తొమ్మిది వందల తొంబదిసంవత్సరముల
కాలము గడిచిన పిదప దేవేంద్రుని సేవలకు 
దితి మిక్కిలి సంతోషపరురాలై 
ఆమె తపస్సు గూర్చి అతనికి తెలుపుతుంది 

ఓ దేవేంద్ర నేను చెప్పే మాట వినుమయ్యా 
నీ తండ్రి కశ్యపునిచే వరము పొందినాను 
పది సంవత్సరముల తర్వాత నేను
శక్తివంతుడైన పుత్రున్ని కనుటకు 

ఆ పుత్రుడు నిన్ను జైంచుటకై జన్మిస్తాడు 
అప్పుడు అతడిని నేను శాంతిపరచగా
నీతో వైర్యాన్ని వీడి సోదర భావం చూపును
ఈ మూడు లోకాలను మీరు ఏలాలి 

 ఇంద్రునికి చెప్పుతూ నిద్రలోకి వెళ్ళింది 
ఆమె శిరస్సు ఆమె పాదాలను తాగింది 
కేశరములకు పాద ధూళి అంటూట వలన 
ఆమెకు దోషముతో తపస్సుభంగమైనది

ఆమె గర్భం నా ప్రవేశించి ధైర్యంతో 
గర్భస్థ శిశువును ఏడు ముకలుగాజేసెను
వజ్రాయుధము దెబ్బకు శిశువు ఏడ్చెను 
శిశువేడుపు విని దితి మేల్కొనేను 
అప్పుడు దేవేంద్రుడు తల్లిని క్షమాపణ కోరినాడు 


కామెంట్‌లు