సృష్టికర్త బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై.
సగరుని అరువది వేల మంది పుత్రులు
ప్రేతాత్మ నుండి విముక్తులైనారు
వారు వెంటనే స్వర్గము చేరినారు
సాగర జలములు ఉన్నంతవరకు
సగర పుత్రులు స్వర్గంలోనే ఉంటారు
ఈ గంగ నీకు పెద్ద కూతురు అగును
నీ సాహసకార్య ఫలితముగా నీ పేరుతో
భగీరథి అను పేరుగాంచి ప్రఖ్యాతి చెందును
స్వర్గ ,భువిన, పాతాళలోకమున
ప్రవహించుట వలన త్రీపథగా వాసిగాంచును
మీ తాత ,తండ్రులకు తర్పములను విడవుము
మీ తాత సగరుడి కోరిక నీ తండ్రి దిలీపుని కోరిక
గంగా జలమును తెచ్చుటకు సాధ్యం కాలేదు
ఆ కార్యము నీవు ధర్మసిద్ధంగా పూర్తి చేసినావు
ఓ రాజా ఈ గంగాజలంలో స్నానము ఆచరించి
పునీతుడవై పుణ్యఫలము పొందుము
ఓ భగీరథ నీకు శుభము కలుగును దీవించి
బ్రహ్మ సత్య లోకము వెళ్లిపోయినాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి