----------------------
గర్భస్థ పిండము ఏడు ముక్కలైనందుకు
దితి పెక్కు దుఃఖమునకు లోనై
బలాసూరులని హతమార్చిన ఓ పుత్ర
నా అపరాధం వలననే ఇలా జరిగినది
నాయనా పుత్ర నీ తప్పు ఏమీ లేదు
గర్భ ఖండితులైన ఏడు ముక్కలు
సప్తమూర్తులై వారు ఏడు లోకాలకు
పాలకులై దివ్య స్వరూపులై ఉంటారు
ఒకరు అను పేరు విఖ్యాతులై దివ్యలోకమందు
వీరిలో ఒకడు బ్రహ్మలోకమందు
మరి ఒక్కడు ఇంద్రలోకమందు
మహా యశస్వియై వాయువు అని పేరుతో
ఓ పుత్ర నలుగురును నీ ఆజ్ఞనుసారం
నాలుగు దిక్కుల యందు సంచరింతురు
దివ్య కుమారులైనా నా పుత్రుల గూర్చి
నీవు ఏడవకు నీకు శుభము కలుగును
గర్భపిండమును సంహరించిన
దేవేంద్రుడు దితి చక్కని మాటలు విని
తల్లికి అంజలి ఘటించిన నాడు
తల్లి భద్రం నీవు చెప్పినట్టుగనే జరుగును

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి