అమ్మ...నా మొదటి ప్రపంచం....మంజుల పత్తిపాటి.
అమ్మ…
ఈ రెండక్షరాల వెనుక
ఎన్నో త్యాగాలు పూడ్చబడి ఉన్నాయి 
ఎన్నో కన్నీళ్లు దాగి ఉన్నాయి ఐనా...
అమ్మ ప్రేమ మాత్రం మారదు..!

మాట రాని సమయాన మనని  అర్దం చేసుకొని 
ఆకలి దుప్పులు తీర్చిన దేవత అందుకే... 
కాలం మారినా,
మనుషులు మారినా,
అమ్మ ప్రేమ మాత్రం మారదు..!

తన ప్రాణాన్ని రెండు ముక్కలు చేసి
ఒక ముక్కను ప్రపంచానికి పరిచయం చేసిన హృదయ మూర్తి అమ్మ..!
మన కోసం తన యవ్వనాన్ని వంటింట్లో కాల్చేసిన యోధురాలు అమ్మ..!

మన నవ్వు కోసం మన భవిష్యత్తు కోసం 
తన బాధలు మౌనంగా గొంతు లోనే దాచేసిన
త్యాగమూర్తి శంకరమ్మ..!
ఎన్ని శత్రు తుఫాన్లు వచ్చినా
మన మీద ఒక్క ధూళి కూడా పడనివ్వని
మహాతల్లి అమ్మ..!

అమ్మ గురించి కవిత రాయాలంటే
సముద్రంలో నీళ్లు సరిపోవు నాకు 
ఎందుకంటే...
సముద్రానికి తీరం ఉంటుంది కాని
అమ్మ ప్రేమకు అంతం లేదు కాబట్టి..!

ఆకాశంలో నక్షత్రాలు సైతం అమ్మ ముందు తల వంచవలసిందే ఎందుకంటే...
తన ప్రాణం నెమ్మదిగా కరిగిపోతున్నా
మన జీవితాలు వెలుగుగా ఉండాలని కోరుకునే కొవ్వొత్తి కాబట్టి..!


అమ్మ ఒడిలో పడుకున్న క్షణం
అమ్మ చేతి ముద్ద తిన్న మధుర జ్ఞాపకం
గుర్తుంచుకో..!
మన కన్నీళ్లను తుడిచి నేను ఉన్నాను అని  చెప్పిన 
అమ్మ గుండెను హత్తుకోని పడుకోని  ఉన్న రోజులు
గుర్తుంచుకో..!

అమ్మ కోసం ఒక రోజు కాదు, ప్రతి రోజు ప్రత్యేకమే
అమ్మకు మాతృ దినోత్సవ (మే 10) శుభాకాంక్షలు .
=============================================
మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
 చరవాణి 9347042218.

కామెంట్‌లు