అవిసె గింజలు: - - యామిజాల జగదీశ్

 అవిసె గింజలు మనకు ప్రకృతి ఇచ్చిన ఒక వరం. వీటిలో నిర్దుష్టంగా ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం (ALA - Alpha-Linolenic Acid) ఉంది. ఈ ఆమ్లం దీర్ఘకాలిక గుండె జబ్బుల్లో, కీళ్ళనొప్పులు, ఆస్తమా, మధుమేహం కలిగించే వాపులు తగ్గించటానికి, ముఖ్యంగా క్యాన్సర్లలో కీలమైన కోలన్ క్యాన్సర్ కు వ్యతిరేకంగా మీ శరీరానికి రక్షణ కవచంలాగా సహాయపడుతుంది.
అక్రోట్లతో, చేపలతో ఈ గింజలను కలిపి తీసుకుంటే, అవిసె గింజలు నిజమైన సహాయాన్ని అందిస్తాయి. అవిసె గింజ‌ల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగు ప‌డ‌డ‌మే కాదు, జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయ‌ని శాస్త్రవేత్తలు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. 
అవిసె గింజ‌ల్లో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది ర‌క్తంలో ఉండే కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తుంది. దీని వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. అలాగే అవిసె గింజ‌లను రోజూ తిన‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంద‌ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మేర‌కు అమెరిక‌న్ జర్న‌ల్ ఆఫ్ ఫిజియాల‌జీ, ఎండోక్రినా ల‌జీ అండ్ మెట‌బాలిజం అనే ఓ జ‌ర్న‌ల్‌లో అధ్య‌య‌న వివ‌రాల‌ను ప్ర‌చురించారు.
అవిసె గింజలు పురాతన ఆహారాలలో ఒకటి. చాలామంది దీనిని ప్రపంచం లోని మొట్టమొదటగా పండించే సూపర్ ఫుడ్లో ఒకటిగా భావిస్తారు. అవిసె గింజలు ఈరోజుల్లో అన్ని రకాల ఆహార పదార్థాలలో ఉపయోగిస్తున్నారు. 
అవిసె గింజలు రుచి, వాసనను చాలా మంది ఇష్టపడతారు. దాని ప్రజాదరణకు మరో కారణమేమిటంటే దాని పోషక విలువలు. అవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. 
అవిసె గింజలు మూడు ముఖ్యమైన పోషక అంశాలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, లిగ్నన్స్, మ్యుసిలేజ్. ఇవి కాకుండా అవిసె గింజలో విటమిన్ B1, ప్రొటీన్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, జింక్, సెలీనియంతో పాటు కరిగే కరగని ఫైబర్ ని కలిగి ఉంటుంది. అవిసె గింజలు పురాతన పంటలలో ఒకటి. 
ఇది వేల సంవత్సరాలు నుండి  వినియోగంతో ఉన్నట్టు చరిత్ర పుటలు తిరగేస్తే తెలుస్తుంది. జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సమాచారం ప్రకారం, అవిసె గింజల లాటిన్ పేరు లినమ్ యుసిటిస్మమం, అంటే “చాలా ఉపయోగకరంగా” అని అర్ధం. అమెరికాలో  అవిసె గింజలు మొదట ప్రారంభ వలసవాదులతో పరిచయమైంది. దాని అధిక ఫైబర్ శాతం కారణంగా ఫాబ్రిక్, కాగితం, బట్టలు తయారు చేయడానికి ప్రధానంగా ఉపయోగించబడింది. ఇది బలం, మన్నికను పెంచుతుంది. అవిసె గింజలు చారిత్రాత్మకంగా ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి పశుసంపదకు ఇవ్వడం జరుగుతోంది. 
1990లలో అవిసె గింజలు ఆరోగ్య ఆహార పరిశ్రమలో బాగా ప్రాచుర్యం పొందాయి. అవిసె గింజలను కొన్నిసార్లు లిన్సీడ్ అని పిలుస్తారు. ఇవి చిన్నవి, గోధుమ లేదా బంగారు రంగు విత్తనాలలా ఉంటాయి. అవిసె గింజలు గురించి మరొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే అవి మానవ ఆహారంలో ఉన్న లిగ్నన్స్ మూలం కావడమే. అవిసె గింజల్ని నూనెను తయారు చేయడానికి ఉపయోగి స్తారు. ఇది సులభంగా జీర్ణమవుతుం ది. ఆరోగ్యకరమైన కొవ్వులకి కేంద్రీకృతమై ఉంటుంది. అవిసె గింజ‌ల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్లు మ‌న శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక బ‌రువును త‌గ్గించ‌డ‌మే కాక‌, శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిని త‌గ్గిస్తాయి. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతాయి. ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉండ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు పోతాయి. హైబీపీ త‌గ్గుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. నిత్యం గుప్పెడు అవిసె గింజ‌ల‌ను తింటుంటే పైన ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చని సైంటిస్టులు చెబుతు న్నారు. అవిసె గింజలలో పూర్తిగా మంచి కలిగించే శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. 
పురాతన కాలం నుండి, అప్పటి నాగరికతలు, సంస్కృతుల పద్ధతుల ద్వారా, ఈ విత్తనాలను ఉపయోగిస్తున్నారు. పురావస్తు ఆధారాల ప్రకారం, ఈజిప్ట్ లో నెఫెర్టిటి కాలం నుండి అవిసె గింజల ఉపయోగం ఉన్నట్టు తెలుస్తున్నాది. 
భారతదేశంలో సాధారణంగా సహజంగా బలమైన ఫైబర్ కలిగి ఉన్న ఈ ఫ్లాక్స్ లేదా "అల్సి" "టిసి" అని పిలిచే ఈ సాగు గింజలను, కష్టపడి పనిచేసే రైతులకు ఆహారంగా ఉపయోగిస్తారు. 
ముడి అవిసె గింజలలో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. ఈ అవిసె గింజల ప్రభావాలు కొలెస్ట్రాల్ తగ్గించడంలో బాధ్యత వహిస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవటం వలన మీరు కొద్ది ఆహారం తీసుకున్నా, మీ ఆకలి తీరిన పూర్తి అనుభూతి పొందుతారు. దీనివలన మీ బ్లడ్ షుగర్ స్థిరంగా ఉంటుంది. పేగుల పనితీరు బాగుంటుంది. ఏజింగ్ క్రీమ్ కోసం యాంటీఆక్సిడాంట్లు, ఫైటోకెమికల్స్ కలిగిన ప్రకటనలను మనం నిత్యం ఎన్నో చూస్తుంటాం. ఈ ప్రయోజనాలన్నీ పైసా ఖర్చులేకుండా అవిసె గింజలు నుండి లభిస్తుంటే వాటిని ఉపయోగించుకోవడం మంచిదే కదా! 
అవిసె గింజలు ప్రేగులలో పని చేసే లిగాన్లను కలిగి ఉంటాయి. ఆడవారి హార్మోన్లు సమతుల్యంగా చేసే పదార్థాలుగా మారుస్తాయి. ఇవి సంతానోత్పత్తి ప్రోత్సహించడానికి, రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించటానికి, రుతుక్రమం ఆగే లక్షణాలను తగ్గించటానికి ఉపయోగపడతాయని నిరూపించబడ్డాయి. 
వైద్యుడు లేదా ఖరీదైన మందుల సహాయం లేకుండా ఈ చిన్న అవిసె గింజల నుండి కలిగే ఈ ప్రయోజనాలన్నిటిని ఆనందించండి. కనుక ఈరోజే మన శరీరానికి ఈ అద్భుతమైన గింజలను బహుమతిగా అందించడం మంచిది కదా....!

కామెంట్‌లు