తల్లి యిలవ :- గంగరాజు పద్మజ
  తల్లి యిలవ తెలియకుంటే అనబడుదువు తులువ
మనం ఈ దినమిట్లున్నమంటే ఆమెదే గద చలువ!
ఎట్లోచి పద్యమూ గాని,నవ మాసాలు మోసేస్తది 
తాను తిన్న తిండినంత రక్తమాంసాలు  చేస్తుంది 
బట్టలైన కట్టిరాము అమ్మొక్కతీ మనకున్నాస్తి
ఆమెకింక షురూ బెడితే మనపై ముద్దు జాస్తి
పాల తాపీ, తొట్టెలో ఊపీ నాన్నను సుట్టాలా సూపీ 
గోరుముద్దలు నోట్ల దోపి సoదమామ కై చేయి సాపీ 
తన ఆడ్డలున్న మనల గడ్డలోచుదక సాకి 
మన కడుపుల నింపనికి అస్ట కష్టాలు మాడుగుల దూకి
చన్ను పాలు తగినోళ్లమై కన్నుమూసి సమయమైనా
తులసి నీళ్ల గొంతు తడప అలసిపోతే ఎంన్యాయం 
మన సర్దపు బతుకులకు పుట్టగతులుండవంట ఖాయం 
తల్లి రుణం తీరబోదు ఆ ప్రేమ గుణం మారబోదు 
ప్రాణం ఉన్నంత దాకా నీ ప్రాణం అనుకో చాలు 
మల్ల జన్మలోనైనా ఆమెనే తలైయితే మేలు.      

కామెంట్‌లు