ఓ బ్రహ్మ మహర్షి నిజము తెలుసుకో
క్షత్రియుల బలము కన్నా
బ్రాహ్మణుల బలము మిన్న
విశ్వామిత్రుడు మహావీరుడే భయం వద్దు
నీ తపశక్తి తిరుగులేనిది స్వామి
నీ బ్రహ్మ బలము చే నాలో శక్తి వచ్చినది
నాకాజ్ఞనిమ్ము అతని బలగర్వమును
నీ ముందే చిత్తు చేసి చూపిస్తాను
వశిష్ఠుడు కామదేనువుతో ఇలా అంటాడు
వారి నోడించే సైన్యమును సృష్టించు
ఆమె బలమైన సైన్యాన్ని సృష్టించగా
విశ్వామిత్రుని సైన్యమంతా అంతమైనది
తన సైన్యము హతమవుట చూసి
రోషముతో రథమునధిరోహించి
వివిధములగు అస్త్రములేసి
పప్లవలను హతమార్చినాడు
దేనువు కోపముతో శకులను, యవనుల
అసంఖ్యకముగా సృష్టించెను
వారిని చూసిన విశ్వామిత్రుడు
శక్తిగల అస్త్రము లేసి హతమార్చినాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి