నరశ్రేష్టుడైన ఓ రఘునందన వినుము
అంబరీష మహారాజు శునశ్రేవుని
వెంటబెట్టుకొని పుష్కర క్షేత్రము వద్ద
విశ్రాంతి తీసుకుంటాడు ఆ మహారాజు
అట్టి సమయములో శునశ్రేవుడు
బలీపశువుగా పోతున్నానని దుఃఖిస్తూ
అతని మేనమామ విశ్వామిత్రునిచెంత
అతని బాధనంతా తెలుపుతాడు
శృనశ్రేవుని మొరవిని విశ్వామిత్రుడు
తన పుత్రులకు అతని గూర్చి తెలిపి
పుత్రులారా మీలోనొకరు బలి పశువుగా వెళ్లి
ఇతనికి ప్రాణదానము చేయుము
తండ్రి మాట విన్నపుత్రులు సమ్మతించక
వ్యతిరేక భావములను తెలిపినారు
వారి మాటలు విన్న విశ్వామిత్రుడు
మిక్కిలి కోపముతో వారిని శపిస్తాడు
వశిష్టుని పుత్రుల వోలె చండాలులై
చండాల జాతిన వేయి సంవత్సరములు
కుక్క పలము భుజిస్తూ భూవిపై జీవించుమని
విశ్వామిత్రుడు తన పుత్రులను శపిస్తాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి