యాలాల పీఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా వేసవి శిబిరం ముగింపు: వెంకట్ , మొలక ప్రతినిధి
 యాలాల మండల కేంద్రంలోని పీఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో గత 15 రోజులుగా నిర్వహిస్తున్న వేసవి శిబిరం సోమవారం అట్టహాసంగా ముగిసింది. ఈ ముగింపు వేడుకలకు మండల ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు హాజరై విద్యార్థులను ఉత్సాహపరిచారు.

​విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు

ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు, పిఎసిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, గ్రామ సర్పంచ్ శివయ్య, ఎంఈఓ శేరి మహిపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ శోభరాజ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
​మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింలు మాట్లాడుతూ, 15 రోజుల్లో విద్యార్థులు తయారు చేసిన వివిధ రకాల ఆకృతులను చూసి ముగ్ధులయ్యారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని కొనియాడారు.
​పిఎసిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించడం గొప్ప విషయమని, విద్యార్థుల ఉత్సాహం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
​ఎంఈఓ శేరి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, రోజుకో అంశంపై శిక్షణ ఇస్తూ, 15 రోజుల పాటు విద్యార్థులు ప్రదర్శించిన నైపుణ్యాలను అభినందించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మెడల్స్, బహుమతులను అందజేశారు. ఈ శిబిరానికి సహకరించిన విశ్వనాధ్పూర్, యాలాల, అక్కంపల్లి, జంటుపల్లి గ్రామాల సర్పంచులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రాబోయే 'బడిబాట' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
​ఎమ్మెల్యేతో విద్యార్థుల ముఖాముఖి
కార్యక్రమంలో భాగంగా ఎంఈఓ ద్వారా ఎమ్మెల్యేతో విద్యార్థులను ఫోన్లో మాట్లాడించారు. 15 రోజుల్లో ఏమి నేర్చుకున్నారో అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆరా తీశారు. భవిష్యత్తులో మీ లక్ష్యాలను చేరుకోవడానికి కావాల్సిన అన్ని రకాల సహకారాలు ఉంటాయని విద్యార్థులను ఆశీర్వదించారు.
​ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్రామేశ్వర్, కాట సంగమేశ్వర్, పిఆర్టీయూ, తపస్, యూటీఎఫ్ మండల బాధ్యులు, ఉపాధ్యాయులు, ఎంఆర్సీ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కామెంట్‌లు