మాతృభూమిపై భక్తితో మడమ తిప్పని పోరాటం,
ఆంగ్లేయుల సామ్రాజ్యవాదానికి
ఎదురు నిలిచిన ధైర్యం,
ప్రజలను ముందుండి నడిపించిన నాయకత్వం,
తూటాలకు సైతం వెరవని ధీరత్వం,
లక్ష్యం పట్ల దృఢమైన చిత్తం,
కార్యదీక్షతో కదలిన చైతన్యం,
ఆంధ్రుల పౌరుషానికి నిలువెత్తు
నిదర్శనం,
ఉక్కుసంకల్పంతో ఉరకలెత్తిన
ఉద్యమానికి సంకేతం,
స్వాభిమానం,ఆత్మవిశ్వాసాలు
కలబోసిన మూర్తిమత్వం,
టంగుటూరి ప్రకాశం పంతులంటే
ఆంధ్రచరిత్రలో మణిమకుటం.
జాతీయోద్యమానికి ఊపిరిలూదిన వ్యక్తిత్వం,
తెలుగువారి తేజస్సును దశదిశలా వ్యాప్తి చెందించిన
మహనీయ చరితం,
ఆంధ్రకేసరిగా కీర్తిశేషమైన ప్రతిష్ఠకు తార్కాణం.
గుండెలను చూపించి కాల్చమని
నినదించిన ధిక్కారం,
స్వరాజ్య స్థాపనకు నడుం బిగించిన మార్గదర్శకత్వం,
రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి చెమటలు పట్టించిన సేవాభావం,
టంగుటూరి అపూర్వ సాహసం
ఆంధ్రుల ఆత్మగౌరవానికి పట్టిన విజయకేతనం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి