గురువులతో ఋత్విజులతో సగరుడు
యజ్ఞ కార్యమును ఆరంభించెను
రాముడు ఆ యజ్ఞం గూర్చి తెలుపమంటాడు
ముని యజ్ఞాశ్వము గూర్చి తెలుపుతాడు
హిమవంతుడను పర్వత రాజు
రామ వినుము మహాదేవునికి మామ
హిమ పర్వతమునకు వింధ్య పర్వతమునకు
మధ్యన ఎత్తైన గిరులుఏవి యుండవు
ఆ పర్వతాలు ఎదురెదురుగానుంటాయి
ఆ రెండు పర్వతాల మధ్య యజ్ఞమాచరించారు
ఆ ప్రదేశము యజ్ఞ కర్మలకు అనువైనది
సగరరాజు గొప్ప అంశమంతుడు
ఇంద్రుడు మాయా శరీరముతో వచ్చి
సగరుడు ఆచరించే ఆ యజ్ఞమునుండి
ఆ మహారాజుకు తెలియకుండానే
ఆ యజ్ఞాశ్వాన్ని అపహరించినాడు
ఋత్విజులు యజ్ఞ అపహరణ గూర్చి
సగరునికి ఈ విధముగా తెలుపుతారు
కకుత్ స్థవంశమునకు చెందిన యజ్ఞాశ్వానికి
యజ్ఞభంగం జరిగిటవలన అరిష్టము ప్రాప్తించును

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి