గోదారోళ్ళ రుచులు.....!!: - యెనుముల వేణుగోపాలరావు -అమలాపురం.
ఇక్కడ దొరికే నేతిబొబ్బట్టు ,
వాటి రుచి __
జీవితంలో మరచిపోతే ఒట్టు !
పాలకొల్లు - పుల్లట్లు...
ఆరుచికి కొట్టకుండా ఉండలేరు చప్పట్లు !
పెళ్లి చూపుల్లో తినిపిస్తే 
కాకినాడ కాజా,
వెంటనే మ్రోగాల్సిందే  పెళ్ళి బాజా !
కండ్రిగ వారి బెల్లం పాలకోవా ,
తింటే _
అనకుండా ఉండలేము వారెవ్వా !
ఆత్రేయపురం పూతరేకులు,
అబ్బా వర్ణించతరమా ఏమి 
ఆ రుచులు! 
చింతకాయ -, యానాం గోదారి లో దొరికే సీరమేను తింటే
పులకించి పోతుంది మరి మేను !
 దవలేశ్వరం గోదారి లో దొరికే పులస ,
పస్తులు అమ్మి అయినా తింటారు lతెలుసా ?
కాజ గ్రామంలో దొరికే దమ్ బిర్యానీ,
గోదారి జిల్లాల బిర్యానీలకే మహారాణి!
 చించినాడ లో దొరికే కోడి మాంసం_ జీడిపప్పు పకోడీ ,
తింటే నీ మనసు ఆడేస్తుంది కబడ్డీ !
మోరి లో దొరికే జీడిపప్పు మిఠాయి,
తింటే _
జివ్వహకు కలుగుతుంది ఎంతో హాయి !
నేనుచెబుతుంటే మీకు నోరు ఊరుతుంది కదా భాయి!
అందుకే గోదారి జిల్లాలకుఓసారి
 విచ్చేయఓయి  !!
                  ***


కామెంట్‌లు