సామెత -220: ఆముదం కొలిచే తవ్వ ఎప్పుడూ జిడ్డే
****
" కొంత మందిరి ఉంటరవ్వా! గాల్లని ఏమనాల్నో తెల్వదు.ఏం పేర్వెట్టి పిలవాల్నో తెల్వదు.బలే గమ్మత్తైన మడుషులు.శెప్పినప్పుడేమో మెదడుకెక్కిచ్చుకోరు. ఆటెంకనేమో ఇష్యం శెప్పమని పాణం తీత్తరు. పట్టుకుంటే జెనిగె లెక్క వదలరవ్వా!"
ఎవలు శెల్లె! నిన్ను గంతగనం బంద్రం పట్టుకున్నట్టు పట్టుకుంది? శెప్పినా ఇన్పిచ్చుకోనిది?"
" ఇంకెవలు.గాడే అవ్వా! మన కొండయ్య మావ శిన్న కొడుకు జంగయ్య.".శెప్పేటపుడు యిని సావడు .శెప్పకుంటే ఓ మానాన వొదిలి పెట్ఠడు." ఏ ముచ్చెటి అయినా గట్లనే శేత్తడు. గట్ల జెయ్యమాకురా అయ్యా! "ఎవలన్న సూత్తె జిడ్డు బట్టినట్టు పట్టిండని ఎక్కిరిత్తర్రా!" అని శిలక్కి జెప్పినట్టు జెప్పిన. ఇంటెనా శెప్పి శెప్పి యాష్ట కొత్తోంది. గాని తల్కాయేం తల్కాయో అవ్వా? వొర్లిచ్చి వొర్లిచ్చి సంపుతడు. గాన్ని తప్పిచ్చుకు తిరగలేక సత్తున్ననుకో. రెడ్డొచ్చె మొదలాయె అన్న తీర్గ. శేత్తడవ్వా!
అవునా శెల్లే! గస్మంటోళ్ళు ఆముదము కొలిశే తవ్వ అస్మంటోళ్ళు.ఎప్పుడూ జిడ్డుగనే ఉంటరు.ఒక పట్టాన వొదలరు..గందుకే గీళ్ళని""ఆముదం కొలిచే తవ్వ ఎప్పుడూ జిడ్డే " అన్న సామెతతో పోలుస్తారు. గట్ల పోల్షినా నాదాను పడరు. గాళ్ళ పద్ధతి,తీరు మార్సుకోరు."
ఇంగ కొందరైతే పైసల కాడ సయిమం సందర్భం లేకుండా అప్పుల కొత్తరు. లెవ్వని ఎంత శెప్పినా ఇనుకోకుండా జిడ్డులా పట్టి అనుకుంది సాదిత్తరు.గస్మంటి తెల్వి శాన్నే వుంటది.
"అవునవ్వా! ఆముదం కొలిశే తవ్వని సబ్బు పెట్టి కడిగినా,,సర్పేశి రుద్దినా శేతుల్నిండ జిడ్డే తప్ప సరింగ పోవుడుండదు. మన పెద్దోళ్ళు బలే సామెతల్ని కనిపెట్టిండ్రు" పో!
అవును గని శెల్లే గింతకీ గా జంగయ్య గాడేమన్నడు శెల్లే!
ఏమంటడు? శిద్విలాసంగ నవ్వుకుంట నాకేం అర్తం కాలే మల్ల శెప్తవా! అన్నడు. గాని పని నెగ్గిచ్చుకొని పోయిండు. గస్మంటోళ్ళకి మంచి బుద్ధి మాటలు సుత శెవికి ఎక్కవు అవ్వా! సొయంగ కండ్ల తోటి సూశినగద.
" అవును శెల్లే! గా జిడ్డు మనకు సుత అంటకముందే వొదిలిచ్చుకోవాలె.గాల్ల బుద్ధే ఆమ్దమస్మంటి జిడ్డు బుద్ధి.
గదండీ సంగతి" ఆముదం కొలిచే తవ్వ ఎప్పుడూ జిడ్డే మరి.గస్మంటి మడుసులు సుత గంతే?
గదండీ సంగతి! "ఆమూదం కొలిచే తవ్వ ఎప్పుడూ జిడ్డే అంటే గిదే మరి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి