ప్రపంచంలో ఇప్పటివరకు నడిపిన అత్యంత పొడవైన, బరువైన రైలు గురించి కొన్ని విషయాలు....
ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన BHP ఐరన్ ఓర్ ట్రైన్ పేరిట నమోదైంది. బి హెచ్ పి అంటే బ్రోకెన్ హిల్ ప్రొప్రైటరీ కంపెనీ.
ఈ రైలు పొడవు 7.353 కిలోమీటర్లు (అనగా 4.57 మైళ్ళు). చివరి బోగీ కదిలేలోపే, ముందు ఇంజన్ అప్పటికే 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్న మాట.
82,000 మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని మోసుకెళ్లిన ఈ రైలు, 402 స్టాచ్యూ ఆఫ్ లిబర్టీల బరువుకు సమానమని చెబుతారు.
ఈ రైలుకున్న 5,648 చక్రాలు, 8 శక్తివంతమైన లోకోమోటివ్‌లు, ఒకదాని వెనుక ఒకటి ఉంచిన 22 ఈఫిల్ టవర్లంత పొడవైన నిర్మాణం!
ఇది పశ్చిమ ఆస్ట్రేలియాలోని యాండీ గని నుండి పోర్ట్ హెడ్‌ల్యాండ్ వరకు 275 కిలోమీటర్లు ప్రయాణించి, సుమారు 10 గంటల్లో తన గమ్యస్థానానికి చేరుకుంటుంది.
ఇంకా ఇందులో అద్భుతమైన విషయం ఏమిటంటే.....
ఈ ప్రపంచ రికార్డు రైలును కేవలం ఒక్క డ్రైవర్ మాత్రమే పూర్తిగా నియంత్రించాడు!
ప్రయాణీకుల కోసం కాదు... ప్రపంచ ఉక్కు ఉత్పత్తికి శక్తినివ్వడానికే నిర్మించిన ఈ ఇనుప భారీ రైలు, మానవ ఇంజనీరింగ్ నైపుణ్యానికి పరాకాష్ట.
కొన్నిసార్లు ప్రపంచంలోని అతిపెద్ద వస్తువులు ఎవరికీ తెలియకుండా... ఎడారి గుండా నిశ్శబ్దంగా ప్రయాణి స్తాయి.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ – బీహెచ్‌పీ బిల్లిటన్ ఐరన్ ఓర్ ఆపరేషన్స్, పిల్‌బారా, పశ్చిమ ఆస్ట్రేలియా (2001 జూన్ 21) ఆధారంగా ఈ రెండు ముక్కలూ ఇచ్చాను.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి