వశిష్టుడు నేలపై సైనికులను చూసి
ఓ కామదేమా నీ యోగ మహిమ చే
బలమైన సైనికులను సృష్టింపుమని
ఆదేనువును ప్రోత్సహించినాడు
ఆ దేను కుంబారము నుండి
సూర్య తేజస్స్ గల కాంభోజులను
పొదుగు నుండి శస్త్రములను ధరించిన
పప్లవలు పుట్టుకొచ్చినారు
యోని ప్రదేశము నుండి యవనులు
పురుష ప్రదేశం నుండి శకులు
రోమ కూపముల నుండి మ్లేచ్చులు
హారీతులు, కిరాతులు ఉద్భవించినారు
కామదేను సృష్టించిన సైన్య బలముతో
విశ్వామిత్ర సైన్యము నేలకొరిగినది
విశ్వామిత్రుని పదిమంది సుతులు
మిక్కిలి కోపముతో అస్త్రములు చేత భూని
తపోధనుడైన వశిష్ఠునిపై దాడి చేసినారు
ఆ మహర్షి తన కంటి చూపుతో
వారందరినీ భస్మం చేసినాడు
వారే సైన్యమంతా భస్మమై పోయింది

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి