వశిష్ఠునితో వైర్యానికి పూనుట వలన
తనకు కలిగిన పరాభవము గుర్తుచేసుకుని
విశ్వామిత్రుడు మిక్కిలి బాధతో
అతడు దక్షిణ దిశకు వెళ్ళినాడు
ఫలములు ఆహారముగా గొనుచు
ఇంద్రియ నిగ్రహముతో విశ్వామిత్రుడు
తీవ్రమైన తపస్సును ఆచరించును
చాలా కాలము తపస్సులో యున్నాడు
ఆయనకు అచ్చట హవిష్యందుడు
మధుష్యందుడు, దృఢనేత్రుడు
మహారతుడను నలుగురు పుత్రులు కలిగిరట
వారు ధర్మ పారాయణులు సత్యవచనలు
అతడు వెయ్యి సంవత్సరములు
తీవ్రమైన తపస్సు చేయగా
విశ్వామిత్రునికిబ్రహ్మ ప్రత్యక్షమైనాడు
నిన్ను నేనురాజార్షిగా గుర్తించాను
విశ్వామిత్రుడు బ్రహ్మ మాటలు విని
నన్ను రాజార్షిగా మాత్రమే గుర్తించారు
బ్రహ్మర్షిగా నన్నెందుకు గుర్తించలేదని
విశ్వామిత్రుడు సిగ్గుతో తలవంచుకున్నాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి