సామెత -234: ఆకలికి అదుపు - ఇంటికి పొదుపు
***
"శెవ్వా! గాల్లేం మడుసులే అవ్వా! జెర్రంతయినా యివురం లేదు. ఒక్కలు గాదు ఇద్దరు గాదు సంటిపొల్లగాండ్ల దెగ్గర్నుంచి పెద్దోళ్ళ దనుక గిదే వర్స.యివురం లేని ఆడోళ్ళు మొగోళ్ళని గా ఇంట్లెనే సూశినవ్వా! గిట్లైతె ఇంగ బాగనె.గా కొంప ఇంగ బాగుపడ్డట్టే."
"ఏంది శెల్లె! వొచ్చొడొచ్చుడే ఎవల్నో గని మాగనే తిట్టుకుంట తల్సుకుంటున్నవ్! గంతగనం యివురం లేని పన్లు ఏం జేశిండ్రు."
" పొల్లగాండ్లకైన పెద్దోళ్ళకైన అద్దు అదుపు ఉండాలె అవ్వా!గదేంది గట్ల జెసుడేందని మన్సు ఉండబట్ట లేక అడ్గితే పెద్దోడు గవ్వే కావాలంటడు. శిన్న పొల్లకు గది లేందే ముద్ద దిగదు.ఇంగ గాయన సంగతి నీకు తెల్వందేముంది వొదినా!" అంది.
"ఓష్నీ! గిదంత నువ్వు జెప్పేది తిండి ముచ్చట్నా శెల్లే! ఎవలైన కడ్పుల బట్టినంతనేగద తినేది.గింతకీ ఎవలి ముచ్చెటి శెల్లే?"
"మొన్న పేటకి పనుండి బొయ్యిన. శాన్నాల్లయింది ఒక్క తీర్గ పిల్వబట్టిందని మేనత్త బిడ్డింటికి ఎల్లినవ్వా! ఒక్క పూట ఉండి వొత్తుంటే బలంతం జేసే తల్కి తెల్లారి సుత ఉండాల్సొచ్చింది. అగ్గో గప్పుడు సూశినవ్వా గా ఇంటోళ్ళ యవ్వారం.గయ్యాల నేను బొయ్యినన్నని మరియాద శెయ్యడానికి గయన్ని తెచ్చిండ్రనుకున్న.గని గాల్లింట దినాం గదే పోకడని అర్తమైంది".
"పూట పూటకీ బయట్నించి రకరకాలవి తెప్పిచ్చుకోడం. ఒకలేమో అన్నిట్ల కోడి గెల్కినట్టు గెల్కి పడెయ్యడం.ఇంకోలేమో గద్దింటే చెక్కెర బీమారీ,గిద్దింటే బీపీ వొత్తది అన్కునుడే.మల్ల బరాబర్ తినుడే.శిన్న పొల్లగాండ్లకైతే ఎంత దినాల్నో తెల్వక కుత్కెల దనుక తినుడు. అర్గక పొట్ట నొత్తుందని ఏడ్సుడు. మూడు మూడొద్దులకి దవాఖానకి సుత ఎల్తరట.శిన్నోళ్ళు పెద్దోళ్ళు తిండి యిష్యానికి.గయ్యన్ని సూస్కుంటనైన పద్ధతి మార్సుకో వద్దా? శెవ్వా! గాల్లింట్ల రొండు పూటల్కే తిండి సై దప్పిందవ్వా! గా తినుడు పారేసుడు సూత్తుంటే... గీళ్ళు పారేశే వాటితో ఇంకో ఇల్లు గడుత్తదనిపిచ్చింది."
అందుకే శెల్లే! "ఆకలికి అదుపు - ఇంటికి పొదుపు ఉండాలె".గిట్ల రైతు కట్టం, అన్నం మెత్కు యిలువ తెల్వక దువార సేశేటోళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు మాగనే తాకిడి తలుగుద్ది. ఎంత ఉంటే మాత్తరం గంతనా శెల్లే! దేనికైనా అదుపు ఉండాలె. గాల్లేం సంపన్న సావుకార్లేం గాదుగద. ఎందుకట్ల శేత్తరో మరి."
"గదేనవ్వా! నేనైతే వొచ్చేటపుడు వొదినె గదాని సనువుతో నువ్వన్న 'అదుపు- పొదుపు ముచ్చెటి శెప్పొచ్చిన.శెప్పుతుంటెనే అడ్డెడాముదం తాగిందాన్లెక్క మొగం బెట్టుకుంది. మన్సు ఊకుండక శెప్పినవ్వా! ఏమన్న అన్కోని."
"మంచి పని సేశినవు శెల్లే శెబ్బాస్."
గదండీ సంగతి! "ఆకలికి అదుపు - ఇంటికి పొదుపు" ఉండాలంటే గిదే మరి.గది లేక కొన్ని కాపురాలు రోడ్ల సుత పడ్డయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి