భగీరథుడు బ్రహ్మ మాటలను విని
భూమిపై కాళీ బొటన వేలుతో నిలబడి
ఒక్క సంవత్సరము పాట శివుని కొరకు
ఆకలి దప్పులు మాని తపస్సు చేసినాడు
అతని తపస్సు మెచ్చి శివుడు ప్రత్యక్షమై
నీకు ఏమి కావాలి కోరుకో మన్నాడు
గంగను మీ శిరస్సున మోయండి. స్వామి
అందుకు శివుడు సమ్మతించినాడు
శివుని మాటలు విని గంగా నవ్వుకుంటు
శివుని శిరస్సున చేరి అతడిని నేను
నా జల వేగంతో పాతాళాన పడ వేస్తాను
శంకరుడు గంగ గర్వమును తెలిసుకున్నాడు
ముక్కంటి ఆమె గర్వమును అనుచుటకై
శివుని జటాజుటములతో బంధించినాడు
గంగాజలము ఎక్కడ కానరాక
మళ్లీ శివునికై తపస్సు చేసినాడు
శంకరుడు గంగను బిందు సరోవరములో
విడిచి పెట్టగా ఏడుపాయలుగా ఏర్పడి
హ్లాదిని, పావని, నళిని అను మూడు గంగలు
తూర్పు దిశగా ప్రవహించెను

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి