సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం
 సామెత -236: ఆరాటపు కదురు ఏ రాటన బెట్టినా బరబరే
  ***
"గా మడిషేందవ్వా!  కారు గిర్రలు,బస్సు గిర్రల్నేమన్న కాళ్ళకి కట్కొని పుట్టిందా ఏంది?  ఏడ గడియ పుర్సత్ గ కూసోదు. ఒక్క సోట కాలు నిల్వదు. గీ వొయసుల సుత తిర్గుడే తిర్గుడు."
"గట్ల తిర్గుట్ల ఏమన్న పెశాంతంగ ఉంటదా అంటే గదీ లేదు.కూసున్నా ఆరాటమే, నిల్సున్నా ఆరాటమే, తొందరే. సూశేటోళ్ళకి గంతగనం ఏం పడిపోతుందబ్బా అనిత్తది.గామె యిష్యం తెల్వనోళ్ళకి గీ లెక్కన మాగనే ఎన్కేసుకుందో ఏమో అన్కుంటరు. గట్లుంటయి గామె శేట్టలు".
"ఎవలు శెల్లే! గంత ఆర్భాటపు మడిషి.ఒకో పాలి గట్లుంటనే బాగుంటది అనిపిత్తది తీ.రికామిగ కూసున్న కానించి  తల్కాయనిండ మంచి శెబరల పురుగులు మెదడు తిని పిచ్చోళ్ళని సుత సేశే పెమాదముంది. "
 "ఏందవ్వో! గా మడిషి ఎవ్వలో శెప్పకుండనే ఎన్కేసుకొత్తున్నవు.గామె లెక్క తిర్గుడు, నీ వొల్ల, నా వొల్ల కాదులే. గట్ల తిర్గుడు, పతి దాన్కి శెడ్డో మంచో యిశారిచ్చుడు,పతిదీ తొరగ అయిపోవాలని శేయ బోయి బొల్తావడుడు సుత ఉందిలే.గట్ల జేబట్టే గామెని బాగ దగ్గరోళ్ళు దుందుడుకు మడిషి,నోరూర్కోదు ,శెయ్యూర్కోదు,కాలూర్కోదు అంటరు."
 ఇగ్గో శెల్లే!గింతకీ గామెవలో శెప్పకుండనే గా మన్షి లచ్చనాలన్ని కల్లముందున్చినవ్. గింతకీ ఎవలో శెప్పు శెల్లే. నాకు సుత తెల్సుకోవాలని మస్తు ఆర్వాటంగ వుంది. "
 గామె అవ్వా మా పెద్దమ్మ బిడ్డ రంజనక్క. మొన్న ఐతారం మా ఇంటికొచ్చింది  సూడు. "
 ఓషోష్! గా రంజనవ్వనా! గామె శాన్నాల్ల నుంచి ఎరికే శెల్లే? గామో ఆర్భాటపు కదురు. ఏడా కుదురుగ వుండదు. ఎదుటోళ్ళు సుత  గామె లెక్కనే ఉండాల్నా ఏంది అనిపిచ్చేలా శేత్తది."
 "అవునవ్వా గామె ఏడున్నా గట్లనే ఉంటది.గామెని సూత్తుంటే  మన్సు ఒక్కపాలే రొండు తీర్ల బోతది .
 నిజంగనే శెల్లే! గందుకే  మన పెద్దోళ్ళు అంటరు" ఆర్వాటపు కదురు ఏ రాటన బెట్టినా బరబరే" అని
గస్మంటి మడుసులు " సేశేది మూర్వాల్లే గని ఆర్వాటం మాత్రం ఆరువాళ్ళు" .గాళ్ళని సుకంగ ఉండుమని సొరగం తోల్కపో గక్కడ సుత ఆర్వాటంగనే ఉంటరు శెల్లే! నూలు వొడికే కదురు లెక్క ."
గదండీ సంగతీ!" ఆరాటపు కదురు ఏ రాటన బెట్టినా బరబరే" అంటే గిదే మరి.గిస్మంటోళ్ళు ఏడున్నా  సందడే సందడి కదురు ఎప్పుడూ బరబరా కదుల్తనే ఉంటది గద. గట్లన్న మాట."

కామెంట్‌లు