స్వాతంత్య్ర సమరయోధురాలు తంగిరాల సీతారామమ్మగారు : - సేకరణ....అచ్యుతుని రాజ్యశ్రీ

 మచిలీపట్నం కి చెందిన సీతారామమ్మ గారు భర్త  శ్రీవీరరాఘవరావుగారితో కలిసిస్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు.ఆమె తండ్రి శ్రీ జె.గోపాలకృష్ణయ్య. బాల్యంనుంచే ఉద్యమాల్లో పాల్గొన్న ఆమె భర్త అత్తగారి ప్రేరణ తో చురుకైన పాత్ర పోషించారు.అత్తగారు ఆరోజుల్లో మచిలీపట్నం కి కౌన్సిలర్!గాంధీజీ తమ ఊరికి వచ్చినపుడు సీతారామమ్మ  వాలంటీరు గా గాంధీజీ దృష్టిని ఆకర్షించింది.ఖాదీవాడకం ప్రచారంలో ఆమెపాత్రచిరస్మరణీయం! సీతారామమ్మ చర్ఖాసంఘాన్ని నెలకొల్పి మహిళల చేత నూలు వడికించేది. మద్యం విదేశీవస్తువులు అమ్మే షాపులముందు పికెటింగులు చేసింది.1932లో ఆమె బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు పంచుతోందని పోలీసులు ఆమెపై రంగునీళ్లు ఒలకబోశారు. ఇది27జనవరి1932లో జరిగిన సంఘటన! ఆమెకు కఠిన కారాగారశిక్ష (ఏడాదిపాటు) 500రూపాయల ఫైన్  వేశారు.అప్పటికి ఆమె గర్భవతి. తన ఏడాదిన్నర  కూతురు రత్నావళితో ఆమె జైలుశిక్ష అనుభవించారు.జైల్లోనే ఆమెకు బాబు పుట్టాడు.సుభాష్ అని పేరు పెట్టారు. ఆతర్వాత ఆమెను విడుదల చేశారు.ఏలూరు దగ్గర ఉన్న గోపన్నపాలెంలో ఆశ్రమాన్ని నడిపారు.1931_32లో టౌన్ కాంగ్రెస్  జాయింట్ సెక్రటరీగా సేవలందించిన తంగిరాల సీతారామమ్మ మనకు ఆదర్శ నారి🌷
కామెంట్‌లు