ఆణిముత్యాలు: - - యామిజాల జగదీశ్
 మహా వీరుడు అలెగ్జాండర్ తాను కొద్ది రోజుల్లో చనిపోతానని తెలియడంతోనే అతను మూడు ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చాడు.
మొదటిది, అలెగ్జాండర్ ఇలా అంటాడు: "నేను చనిపోయిన తర్వాత, నా శవపేటికను ప్రపంచంలోని ఉత్తమ వైద్యులు మోయాలి. ఎందుకంటే 'మరణం' అనే వ్యాధి నుంచి ఎంత మంది గొప్ప వైద్యులైనా ఎవరినీ కాపాడలేరని ప్రపంచం తెలుసుకోవాలి.
రెండవది : "నా అంతిమయాత్రలో నా శవపేటిక ముందర సైనికులందరూ  నడవాలి. ప్రపంచంలోని ఉత్తమ సైనికులను సురక్షితంగా ఉంచిన అలెగ్జాండర్ ప్రాణాలను మృత్యుదేవుడు తీసుకున్నప్పుడు, ఏ సైనికుడూ దానిని ఆపలేడని ప్రపంచం తెలుసుకోవాలి.
మూడవది: శవపేటిక ఊరేగింపు సమయంలో నా రెండు చేతులు అందరికీ తెలిసేలా బయటకు
చాచి ఉంచాలి. ప్రపంచాన్ని తన చేతుల్లో పట్టుకున్న అలెగ్జాండర్, వెళ్ళేటప్పుడు తన రెండు చేతుల్లో ఏమీ లేకుండా వెళ్తున్నాడని ప్రజలంతా గ్రహించాలి." 
అలెగ్జాండర్ ఈ మూడు కోరికలు మానవ జీవిత  అశాశ్వతత్వాన్ని ఎంత చక్కగా చెబుతున్నాయో గ్రహించాలి మరి.


కామెంట్‌లు