సుప్రభాత కవిత : - బృంద
ఎదురు పడ్డ నవ్వులన్నీ 
ఎప్పటి అనుబంధాలో...
ఎవరి మాట ఎపుడు కలిసినా 
ఎరుగలేని బంధాలేమో!

ఎవరి ఋణం ఎంత ఉందో 
ఏ బంధం ఎంతవరకో!
ఎక్కడ కలిసేనో ఏమి మార్చేనో 
ఎవరికి తెలియని మమతలు!

అడగకనే  ఆదరించి 
పిలువకనే పలకరించి 
తలవకనే చేయందించే 
వెలలేని నెయ్యాలెన్నో!

కలవాలని అనుకోక 
కలవకనే  కనికరించి..
కలలు నిజమయ్యే క్షణం 
వరమిచ్చే పరిచయాలు!

గాలివాటుగా సాగిపోయే 
నావలాటి  జీవితాలకు 
తీరం చేరేవరకు తోడుంటానని 
ధైర్యం చెప్పే స్నేహాలు!

అనుకోని అభిమానంతో 
అరుదైన  ఆనందమిచ్చి 
అంతలోనే మాయమయ్యే 
అమూల్య   అంతరంగాలెన్నో!

ప్రతి మనసుకు ప్రణమిల్లుతూ 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు