అహల్య శాప విముక్తి : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
వృషణములను కోల్పోయిన ఇంద్రుడు 
దీనావధనుడై దేవతలను వేడుకొనెను 
గౌతమ మహర్షి కోపమునకు నేను 
శాపగ్రస్తుడనై వృషణములను కోల్పోతిని 

అతని శాపంతో అహల్య రూపం పోయినది 
దేవతలారా గౌతమ ముని తపస్సును 
భంగపరిచి నాకు సహాయము చేయుడు
ఇంద్రుని విన్నపమును ఆలకించి 

అగ్ని మొదలగు దేవతలందరూ కూడా 
దయా గుణముతో వారంతా కదిలి 
పితృదేవుని కడకు వెళ్లి ప్రార్థించి
గౌతమణిచ్చిన శాపం గూర్చి తెలిపినారు 

ఈ యజ్ఞమునకు మేకపోతునిచ్చాము కదా
దాని వృషణములతో ఇంద్రుని సఫలుని గావింపుడు
అతని సంతోషం కొరకు అర్పించిన మేక 
అప్పటినుండి వృషణములు లేనిదై నది 

అగ్నిదేవుని ఆజ్ఞానుసారముగా 
పితృదేవులందరూ మేష వృషనములను
దేవేంద్రునికి అతికించి సంతృప్తి పరిచినారు 
వారికి దేవేంద్రుడు అంజలి ఘటించినాడు


కామెంట్‌లు