కదలండి..దిండి కి...!!యెనుముల వేణుగోపాలరావు - అమలాపురం.

 పచ్చదనానికి మారు పేరు 
కోనసీమ జిల్లా......
అక్కడొక
మారుమూల గ్రామం దిండి!
ఒకప్పుడు ఆ ఊరు వెళ్ళాలంటే...
తప్పక ఎక్కవసివచ్చేది ఎడ్ల బండి !
మరి..ఇప్పుడో...
ఏ. పీ టూరిజం వారి చొరవతో.....
 ప్రపంచం లోనే .....దిండి
ఒక మంచి పర్యాటక కేంద్రం అండి!
వర్ణించతరమా అక్కడి
హరిత రిసార్టు అందాలు...ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలు !
ఆకుపచ్చని తివాచీ పరిచినట్లుగా ...
సహజ సిద్ధమైనపచ్చగడ్డితో...
స్వాగతం పలుకుతుంది!
ఆకాశాన్ని అందుకోవడానికి....
పోటీ పడుతున్నట్టుగా ఉండే కొబ్బరిచెట్లు,
కనువిందు చేస్తాయి _
కేరళం...అందాలు తలపించేటట్లు !
చూసేవారి ఆనందానికి 
ఉండవు మరి పట్టపగ్గాలు !
వేసవిలో చిన్నారులకు 
ఆహ్లాదాన్ని....
కలిగించే ఈత కొలనులు,
కడవలు పట్టుకున్న 
రమణిమణుల ప్రతిమలు !
రిసార్టును ఆనుకుని _
వయ్యారాలు పోయే...వశిష్ట గోదావరి!
సంధ్యా సమయంలో 
గోదావరి లో బోటు విహారం ,
ప్రకృతి అందాల సమహారం ,
కడు రమణీయ దృశ్యాల మణిహారం !
ఎటు చూసినా పచ్చదనం....
మన చూపును మార్చుకోలేం !
పేదరాశి పెద్దమ్మ కుంకుమ ఆరబోసిందా...
అన్నట్లుగా ఉండే నింగి అందాలు,
ఆ ఎరుపుతో మరింత అందాన్ని...
రంగరించుకున్న గోదారి అలలు !
గూటికి చేరే పక్షుల కిలకిల రావాలు ,
ప్రకృతి అందాలను ఎన్నటికీ....
మరువలేరు చూపరులు !
తప్పక చూడవలసిన ప్రదేశం దిండి!
ఆయ్ ..... ఆ విషయం 
ఎన్నటికీ మరిచి పోకండి !
ఇంకెందుకు ఆలస్యం మరి 
సందర్శించండి ఇక దిండి!!
                  ***
కామెంట్‌లు