ఆ దిగ్గజములు చెప్పిన మాటలను విని
త్వరగా అంశమంతుడు ముందుకు వెళ్లాడు
పినతండ్రుల భస్మరాసుల వద్ద నిలిచాడు
అచట పినతండ్రులెవరు కనబడరు
వారి మరణ వార్త విని ఎంతో పరితపిస్తూ
అంశమంతుడు దుఃఖిస్తూ అటు చూశాడు
వారి మేనమామ గరత్మంతుడున్నాడు
దగ్గరలో అశ్వము తిరుగుట గమనించాడు
ఓ నరోత్తమా నీవు దుఃఖించకు
వారి మృతి లోకహితమునకే జరిగిను
మహానుభావుడైన కాపిలుని కోపాగ్నికి
దగ్ధమై వారు భస్మమై పోయినారు
వీరికి తర్పణములను విడువ తగదు
ఆ బస్మమును గంగాజలంలో కలుపుము
మీ పినతండ్రులను గంగ పవిత్రులను చేస్తుంది
60 వేల మంది సగర పుత్రులు స్వర్గము చేరినారు
అంశమంతుడు యజ్ఞాశ్వమును గైకొని
తాత వద్దకు వెళ్లి విషయము తెలిపినాడు
పుత్రుల మరణ వార్త విని దుఃఖించినాడు
సగరుడు 30 వేల వత్సరాలు
రాజ్య పాలన చేసి దివంగతుడైనాడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి