విశ్వామిత్రుడు తీవ్రతపస్సు చేయబూనెను
అదే సమయమున ఇక్ష్వాక వంశస్థుడు
త్రిశంక మహారాజు రాజ్యమేలుచూ
గొప్ప యజ్ఞములను అతడు చేసాడు
త్రిశంకుడు సశరీరస్వర్గ ప్రాప్తిగా
దేవతలుండు స్వర్గానికి వెళ్లాలని
వశిష్ట మహర్షిని అడుగుతాడు
అందుకామహర్షి నిరాకరిస్తాడు
త్రిశంకుడు వశిష్ట పుత్రుల చెంతకెళ్ళి
దీర్ఘ కాలమచట తపమొనరించి
వశిష్ట పుత్రులను దర్శించుకుంటాడు
భక్తితో వారికి ప్రణవిల్లుతాడు
వారితో త్రిశంకుడిలా విన్నవించుకుంటాడు
నేను శరణు గోరుచున్నాను
నన్నాదుకొనుడు పుణ్యాత్ములారా
వశిష్ట మహర్షిచే నిరాకరించబడితిని
నా శరీరముతో నేను స్వర్గము
వెళ్లాలనుకుంటున్నాను అందుకని
మీరు నాతో యజ్ఞ యాగాలు చేయించి
స్వర్గలోకము దారి జాపమని కోరినాడు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి