తిరుమలరావుకు మాతృమూర్తి ప్రశంసాపత్రం

 పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు మాతృమూర్తి ప్రశంసాపత్రం పొందారు. మాతృ దినోత్సవ సందర్భంగా మనం ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు డా.కె.చక్రవర్తి నేతృత్వంలో జాతీయ స్థాయిలో కవితలను ఆహ్వానించగా తిరుమలరావు పంపిన కవిత ఎంపికై ప్రశంసాపత్రం సాధించింది. భారత ప్రభుత్వ నీతి ఆయోగ్ చే ఆమోదించబడి, ఐఎస్ఓ సర్టిఫైడ్ ఆర్గనైజేషన్ మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కవితల పోటీలను నిర్వహించగా తిరుమలరావు పంపిన శ్రవణకుమారుని ఆదర్శం అనే కవిత పంపగా ప్రశంసాపత్రం సాధించింది. ఈ సందర్భంగా తిరుమలరావును రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం, కొత్తూరు రచయితల వేదిక అధ్యక్షులు కలమట శ్రీరాములు తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు