హలో పిల్లలూ! గోంగూరతో పప్పు వండుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు. గానీ అమ్మాయిని తయారు చేయవచ్చా? చేయవచ్చు! చూడండి. ఈ గొంగూరమ్మాయి బాగుందా ! నేను మా కుండీలో గోంగూర చెట్టును పెట్టుకున్నాను. అందుకే ఈ గోంగూర లేత ఆకుల్ని తీసుకున్నాను. దీనిని ' రెడ్ సోరెల్ ' అని పిలుస్తారు. ఇది పుల్లగా ఉంటుంది. పోషకాలున్న ఆకుకూర. ఇందులో ఐరన్, విటమినే ‘ఎ’ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. గోంగూరలో ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర అని రెండు రకాలుంటాయి. రక్తహీనతను నివారిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
గొంగూర ఆకుల్ని పాప యొక్క గౌనుగా కుట్టేశాను. పిస్తా తొక్కలకు నలుపు రంగు గీసి కళ్ళగా అమర్చింది. ముఖానికి ఆకుగా విప్పుకొని ఆకుల్ని అమర్చాను. జుట్టుగా కూడా మడుచుకున్న ఆకుల్ని అమర్చాను. పెదవులుగా దానిమ్మ పువ్వును పెట్టాను. చెవులకు ఎర్ర మిరప కాయలను లోలాకులుగా వేలాడ దీశాను. కనుబొమ్మలకు చిన్న పచ్చిమిరప కాయల్ని పెట్టాను. బొట్టు పెట్టి, కాటుక దిద్ది పాపను రెడీ చేశాను.
గోంగూర గౌను వేసుకున్న పాప
ఎర్ర మిరప లోలాకులున్న పాప
పిస్తా తొక్కలు కళ్ళుగా ఉన్న పాప
దానిమ్మ పూల పెదవుల పాప!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి