అదే...సత్య,నిత్య,శాస్వతం...! : - కోరాడ నరసింహా రావు!
అద్దం ముందుఅంత రా త్మ.... 
తన అసలు రూ పా న్ని చూసుకుంటోంది...! 

అహంకారం అణగితేగాని ఆత్మ దర్శనం జరగదుగా!
 సత్యాన్ని చూడగలిగి నపుడే... 
  సా0త్వన పొందగలిగేది!! 

అద్దం నిర్మలమైనదైతేనే నీ నిజరూపాన్నిచూపగలిగేది
 స్వచ్చత లోపించిన దేదైన... 
  ఆది అసత్య ప్రచారమే చేస్తుంది...! 

నిర్మలత్వము,నిష్కల్మసత్వమే... 
  నిజమైన అందము, ఆనందము...! 
 అదే సత్యము... 
  అదే నిత్యము... 
    అదే శాస్వతము...!! 
     *****

కామెంట్‌లు