ఈమధ్య రామాయణము -బాలకాండము-ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
బ్రహ్మాస్త్రం కబళించుచున్న సమయమున
వశిష్టురౌద్ర రూపం చూడ సౌఖ్యము గానిది 
మూడు లోకాలు మూర్చ నందనట
వశిష్ట రోమముల పొగతో నిండే నట 

అగ్నికిలలు జ్వాలలై ఎగిసే పడగా 
వశిష్టుడు చెతబట్టిన బ్రహ్మాస్త్రం
పొగలేని ప్రళయ అగ్నివలె నుండి
మరొక యమదండము రీతిగా ప్రజ్వరెళ్లను 

మునీశ్వరులు వశిష్టుని స్తుతించుతూ 
ఓ బ్రహ్మర్షి నీ బలము అమోఘము
నీ మహిమతో బ్రహ్మాస్త్ర తేజమును 
ఉపశమింపజేసిన ఓ పూజ్యుడా 

మహాతపశ్శాలైన విశ్వామిత్రుని గ్రహించితివి
ఓ జన శ్రేష్ట శాంతింపుము 
లోకముల బాధలను తొలగింపుమని
మునులు వశిష్టుని వేడుకున్నారు 

తేజష్యుడైన వశిష్ఠుడు శాంతించినాడు 
విశ్వామిత్రుడు శాంతముగా యోచించి 
క్షత్రియుల కన్నా బ్రహ్మ తేజము గొప్పదని 
తపస్సు చేయుటకు నిర్ణయించుకుంటాడు 


కామెంట్‌లు