ఒక దట్టమైన అడవిలో కోతి ఉండేది.అది తెలివిగలది. అడవికి జనాలు స్వార్థంతో చెట్లను నరికేస్తూ,కలపను అమ్ముకుంటున్నారు.కోతి ఇదంతా చూస్తూనే ఉంది.
రోజులు గడిచేకొద్దీ అడవి పలచబడింది. కోతికి తినడానికి పండ్లు దొరకడం కష్టమైంది.ఇలాగైతే మనం బ్రతకడం ఎలా? అని అది ఆలోచించసాగింది.
ఒకరోజు చిన్న పిల్లవాడు చేతిలో గొడ్డలి పట్టుకుని అడవికి వెళతాడు. చిన్న చెట్టును నరకడానికి సిద్ధమయ్యాడు.అది చూసిన కోతి ఆ అబ్బాయి దగ్గరకు వెళ్లి,ఇలా అన్నది.
బాబు! అంత చిన్న చెట్టును ఎందుకు నరుకుతున్నావు? అనికోతి అడిగింది.
ఏయ్! నీకెందుకురా ఇవన్నీ? నువ్వు కోతివి, కోతిలా ఉండుఅంటూ గొడ్డలితో బెదిరించాడు.
కోతి మనసు బాధపడింది.
కొన్నిరోజులకు చెట్లు లేకపోవడంతో అడవిలో వేడి పెరిగిపోయింది.జంతువులకు గాలి పీల్చుకోవడానికి కష్టమైంది.అని కోతి ఒక గట్టి నిర్ణయానికి వచ్చింది.
అడవిలోని జంతు పక్షులను పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
చెట్లను నరికేస్తూ మన ఇళ్లను నాశనం చేస్తున్నారు.మనం ఇలాగే ఉంటే.. త్వరలోనే మన జంతు,పక్షుల జాతి మొత్తం అంతరించిపోతుంది. మనం బతకాలంటే మనుషులను అడవిలోకి రానివ్వకూడదు. దీనికోసం మనం ఒక ప్రణాళిక వేయాలి.
మనుషులు నరికేసిన ప్రతి చోటా మనం కొత్త మొక్కలు నాటుదాంఅని అనుకున్నాయి.అడవిని మళ్లీ పచ్చదనంతో నింపుదాం. అప్పుడు మనకు స్వచ్ఛమైన గాలి, ఆహారం,వర్షాలు వస్తాయి. అలాగే,వారు అడవిలోకి రాకుండా దట్టమైన ముళ్లకంపలను నాటాయి.
నరికిన చోటల్లా విత్తనాలు చల్లి, మొక్కలు నాటాయి. కొద్ది రోజుల్లోనే అడవి మళ్లీ పచ్చని వనంగామారింది.
కొన్ని రోజుల తర్వాత
మనుషులు అడవికి వెళ్లారు. జంతువులన్నీ గుంపుగా వచ్చి వారి ముందు నిలబడ్డాయి.
"మనుషులారా! మీ స్వార్థం కోసం మీరు చేసిన తప్పును, మేము సవరించుకున్నాం. ఈ చెట్లను మేమే నాటాం.. ఇకనైనా మారండి.
ఆ రోజు నుంచి గ్రామస్తులు కూడా తమ ఊరిలో చెట్లను నాటడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రారంభించారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి