వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
93. కులాంతస్థా (చతురక్షరీ)
94. కౌళినీ (త్ర్యరక్షరీ)
తొంభై నాల్గవ నామ మంత్రము -
ఓం కౌళిన్యై నమః
కులము, అకులములకు మధ్య సామరస్యానికి మరో రూపుగానూ, శక్తిని ఆరాధన చేసే శాక్తేయులకు శక్తిస్వరూపిణి గా కనిపిస్తున్న పరాత్పరిని చూసి, వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "కౌళినీ" అని కీర్తించారు. కులము అకులముల కలయికగా ప్రకాశిస్తున్న అమ్మలగన్నయమ్మకు నమస్కారము.
"కులము" కు అనేక నానార్ధములు ఉన్నాయి - దేశము, గృహము, ఒకే రకమైన ఆచారములు, పద్ధతులను పాటించే సమూహం, గోత్రము, దేహము మొదలైనవి. అంటే, ఇప్పుడు చెప్పబడిన అన్ని చోట్లలోనూ, సర్వకాల సర్వావస్థలలో, పరమేశ్వరి పూజింప బడుతుంది.
"కులము" అంటే, "పరమేశ్వరి". "అకులము" అంటే "పరమేశ్వరుడు". ఈ కుల అకులముల సంబంధముతో ఏర్పడే రూపమే "కౌలము" = "సంబంధము". జగజ్జనని ఇటువంటి సంబంధము కలది కనుకనే "కౌలినీ" అని పిలువబడింద.
పరాత్పరిని పూజించి, ఆరాధించే విధానాలు, సమయాచారము, కౌళాచారము, దక్షిణాచారము, వామాచారము, అని నాలుగు రకాలుగా ఉంటాయి. ఇందులో, సమయాచారము - సంప్రదాయబద్ధంగా, వేదశాస్త్ర విహితంగా ఉంటుంది. వామాచారములో బాహ్యంగా చేసే పూజలకు ప్రాముఖ్యత ఉంది. ఇది తంత్ర ప్రధానంగా ఉంటుంది. దక్షిణాచారమునకు సమయాచారానికి చెప్పుకోతగ్గ తేడాలు ఉండవు.
అమ్మ యొక్క అనేక రూపాలు, అనేక గ్రామదేవతల పేర్లతో మనకు నిత్యం కనిపిస్తాయి. ఈ గ్రామదేవతల ఆరాధన, పూజాదికాలు "కౌళాచారము" ప్రాకారము జరుగుతాయి. ఇక్కడ జరిగే ఆరాధనలో, జోరుగా జంతుబలులు జరుగాతాయు. మద్యం ప్రసాదంగా ఇవ్వబడుతుంది. భక్తులు , అమ్మవారు తమను పూనింది / ఆవహించింది అనే భావనను పొందుతారు. వేప చెట్లు, కొమ్ములు, ఎర్రనీరు, పానకము వంటివి కూడా వాడబడతాయి. ఏదిఏమైనా, జగన్మాత, కౌళాచారములో ఈ నేల నాలుగు చెరగులా ఆరాధించబడుతుంది, పూజింప బడుతుంది.
సహస్రారము లోని తెల్ల కమలము - అకులము - మహేశ్వరుని గా; మూలాధారము లోని ఎర్రకమలము - కులము - మహా శక్తి గా, సామరస్యానికి ప్రతీకలుగా, "కౌళిని" గా తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాతను పూజించేటప్పుడు ఓం కౌళిన్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి