వయసుతో పని లేకుండా
ప్రతి మనిషి మనసు ప్రతిక్షణం కోరుకునేది
అటెన్షన్.
మరో భయంకరమైన నిజం మనిషి మరొకరితో పోల్చుకోవడం అదో అతి పెద్ద రోగం.!!
మనిషి చిన్నపిల్లడిలా తనకు కనిపించిన ప్రతిదీ తన సొంతం కావాలని కోరుకుంటాడు
మరొకరికి దాన్ని ఇవ్వడానికి ఇష్టపడడు.!!
మనిషి చచ్చిపోతాడు కానీ ఆశ చావదు.
మనిషి దేనికోసమో నిరంతరం నిరీక్షిస్తాడు
దాన్ని పొందకుండానే మరణిస్తాడు.!!?
చెట్టులా మనిషి తన చుట్టూ పెరిగిన కలుపు మొక్కల్ని ప్రేమించాల్సి రావడం దురదృష్టకరం.
మనిషి నేటి కన్నా రేపు బాగుంటుందని నమ్ముతాడు
కానీ రేపు కూడా నిన్నటి కన్నా భయంకరంగానే ఉంటుందని తెలుసుకుంటాడు.!!?
మనిషి దేన్నైనా ఎప్పటికప్పుడు మర్చిపోతే ప్రయాణం బరువు లేకుండా ఉంటుంది.
ప్రపంచంలో అత్యంత ఆకర్షణీయమైనవి స్త్రీ డబ్బు కీర్తి అధికారం కానీ
డబ్బుతోనే వాటన్నిటిని కొనవచ్చునని మనిషి రుజువు చేసిండు.!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి