మా ఖానాపూర్ బడిలో
అబ్దుల్ కలాం కొలువై ఉన్నాడు.
పచ్చని ప్రకృతి లాంటి
మా బడి ఒడిలో
పిల్లలందరూ విజ్ఞానవంతులవుతున్నారు.
మా బడికి
కుందేలు పిల్ల వచ్చింది
పచ్చని గరుకతిని
చెంగుచెంగున ఎగిరింది
ఆడుతూ పాడుతూ చదువు నేర్చుకుంది
సింహాన్ని ఓడించింది.
మా బడికి
జింకపిల్ల వచ్చింది
చిరునవ్వుతో చదువుకుంది
పచ్చని మైదానంలో పరిగెత్తి పరిగెత్తి
చిరుతనే గెలిచింది.
మా బడికి
కుక్క పిల్ల వచ్చింది
ఆడుతూ పాడుతూ చదువుకుంది
హుషారుగా స్నేహం చేసింది
దొంగను పట్టించింది
ఊరిలో ఉద్యోగం సంపాదించింది
మా బడికి
పిల్లి పిల్ల వచ్చింది
మెల్లి మెల్లిగా ఒదిగింది
కొద్ది కొద్దిగా నేర్చుకుంది
ఎలుకను పట్టింది
ప్రతి ఇంట్లో ఉద్యోగం పొందింది.
==========================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి