33 వసంతాల విజయ ప్రస్థానం :

 నైతిక విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన త్రివేణి పాఠశాల 33 విజయవంతమైన విద్యా సంవత్సరాలను పూర్తి చేసుకుని, 34వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఖమ్మం పాఠశాల ప్రాంగణంలో ఆవిర్భావ దినోత్సవ ముందస్తు వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి త్రివేణి ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. ఈ సందర్భంగా డ్రాయింగ్, వ్యాసరచన, పోస్టర్ తయారీ, కవితా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కామెంట్‌లు