మరుగున పడిన మగువలు 36: -అనువాదం...అచ్యుతునిరాజ్యశ్రీ
 డా.కె.జానకిగారిRole of women in freedom struggle in Andhra Pradesh
కొండా అలివేలుమంగ సత్యవతి1911లో సీతారామయ్య, సరస్వతమ్మల రెండో కుమార్తె.భర్త రంగారావు.సోదరి కనుపర్తి హనుమాయమ్మ. ఇద్దరూ పిన్నవయసులో భర్తల్ని, తల్లిదండ్రులను కోల్పోయారు.దేశరాజుసాంబశివరావుగారి ప్రేరణ తో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.గుంటూరులో కాంగ్రెస్ శిబిరాన్ని ఏర్పాటుచేసి ప్రభాతభేరీ, నగర సంకీర్ణత, ఊరేగింపులు,సభలు నిర్వహించారు.కాంగ్రెస్ శిబిరంకోసం విరాళాలు సేకరించారు.20రోజులు గుంటూరు సబ్ జైల్లో పెట్టారు.మద్యం,విదేశీవస్త్రషాపులముందు పికెటింగ్ చేయటం,ఖాదీప్రచారంచేశారు.
50రూ.ఫైన్ కట్టనందుకు సత్యవతి చేతి 4 బంగారుగాజుల్ని బలవంతంగా లాక్కున్నారు.22జూన్ 1932లో వెల్లూరుజైలుశిక్ష అనుభవించిన మగువ ఆమె.మంతెన చిన్న అచ్చాయమ్మ భర్త వెంకట రాజు వీరిది మంతెన వారి పాలెం. భార్యాభర్తలు ఇద్దరూ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు .భర్త లాహోర్ కాంగ్రెస్ (1929) సభకు హాజరైనారు .ఆమె అరెస్టు కాలేదు. కానీ అన్ని ఉద్యమాలలో పాల్గొన్నారు. మంతెన సత్యవతి భర్త రాధా కృష్ణం రాజు. ఆమె తల్లిదండ్రులు ఉద్దరాజు సురపరాజు బంగారమ్మ గార్లు. స్వాతంత్రం వచ్చాక ఆమె కాంగ్రెస్ వర్కర్ గా విశేష సేవలు అందించారు.సుఖవాసి భారతమ్మ 1920లో పుట్టారు .ఆమె కావూరు నివాసి తండ్రి  మొవ్వ వ్వ కృష్ణయ్య, భర్త సుఖవాసి కృష్ణయ్య వారిద్దరూ స్వాతంత్ర సమరయోధులు ఈమె కూడా పాల్గొని 22 జనవరి 1932లో వెల్లూరు కన్ననూరు లో జైలు జీవితం గడిపారు.  తుమ్మల చంద్రమ్మ తండ్రి నా గండ్ల శేషయ్య భర్త బాపయ్య. 16 జులై 1930లో వెల్లూరు జైల్లో ఆమె గడిపారు. ఇంకా 29 మార్చి 1932లో తిరిగి అరెస్ట్ అయినారు.
తుమ్మల చిన్న అమ్మాయి 10 అక్టోబర్ 19 06 ఆరులో జన్మించారు. తండ్రి పావులూరి హనుమయ్య. భర్త రాఘవయ్య. గోవాడలో నివసించారు .భర్త ప్రోత్సాహంతో ఉద్యమాలతో పాల్గొని 22 జనవరి 1932లో వెల్లూరు కన్ననూరు లో జైలు శిక్ష అనుభవించారు .మద్దుల చిన్నమ్మ గుంటూరు నివాసి. తండ్రి ఈశ్వరయ్య. 200 రూపాయల ఫైను ఒక ఏడాది జైలు శిక్ష అనుభవించారు. వెల్లూర్ లో కొరటాల దుర్గమ్మ 1897లో జన్మించారు .తండ్రి పున్నయ్య. భర్త కృష్ణయ్య. నందివెలుగులో ఉన్న ఈమెకు 24 మార్చి 1932లో మద్రాసు వెల్లూరులో జైలు శిక్ష విధింపబడింది. దండి యాత్ర సంబరాలలో పాల్గొన్నందుకు 12 మార్చి 1934లో తెనాలిలో అరెస్ట్ అయినారు.🌷

కామెంట్‌లు