మరుగున పడిన మగువలు 43: -అనువాదం...అచ్యుతునిరాజ్యశ్రీ

 డా.కె.జానకిగారిRole of women infreedom struggle in Andhra Pradesh
పాదుర్తి సుందరమ్మ 21డిసెంబర్ 1902లో బ్రాహ్మణ కోడూరులో పుట్టారు.అమ్మ నాన్నలు  అన్నపూర్ణమ్మ, మద్ది లక్ష్మీనరసింహంగార్లు.1920లో ఆమె తొలిసారి గాంధీజీని చూశారు.ఖద్దరుధారణతో నూలువడకటం ప్రారంభించిన ఆమె మీటింగ్స్ లో ఉపన్యాసాలిస్తూ తన ఇద్దరు చిన్నపిల్లల్ని పెద్దలపై వదిలి కాళహస్తి వెంకట గిరిలో మద్యందుకాణాలపై ఉక్కుపాదం మోపింది.తన కన్న బిడ్డల బుర్రల్లో దేశభక్తిని నింపారామె. ఆమె 8ఏళ్ల కొడుకు ఓసభలో స్వాతంత్య్రోద్యమంగూర్చి గడగడ మాట్లాడి అందరిలో జోష్ నింపాడు. 144వ సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు,ఆమె ఒక్కరే ధైర్యంగా రోడ్లపై జాతీయ గీతాలు పాడటం, 26 ఆగస్టు 1930లో అరెస్టై వెల్లూర్ జైలుశిక్ష అనుభవించారామె. విడుదలైనాక జైల్లో అబలలదుర్భరస్థితిని గూర్చి ఓసంఘాన్ని పెట్టి ఆందోళన చేసింది.కరాచీ, బాంబే,మద్రాస్,హైద్రాబాద్,నాగపూర్లో కాంగ్రెస్ మీటింగ్స్ కి హాజరై ప్రభాత్ భేరీలు, జెండాలెగరేయటంతో గాంధీజీ ఆమెను స్వయంగా అభినందించారు.భరత్ సింగ్ తండ్రిని బాపూ ఓదార్చటంతో ఆమెలో దేశ భక్తి ఎగిసిపడింది. ఎ.ఐ.సి.సి.మెంబర్ గా,టౌన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా వాలంటరీ శిక్షణ కోసం బాంబే వెళ్లారామె.సి.ఐ.డిలు వెంటాడుతుంటే ఒక రోగి లాగా నటిస్తూ అలా వేషధారణతో  గుంటూరు ఎ.సి .కాలేజ్ పిల్లల్ని బాయ్ కాట్ చేయమని ప్రేరేపించినది.ఆమెను అరెస్ట్ చేసి మంగళగిరిలో విడిచిపెట్టారు.1930లో బందరులో  ఉప్పు తయారుచేసి జనాల్లో స్ఫూర్తినింపారామె.500రు.ఫైన్ వెల్లూరుజైలుశిక్ష వేశారు.ఫైన్ కట్టలేదు.విడుదలైనాక స్వదేశీ షాపును తెరిచి అలహాబాద్, గ్వాలియర్,లాహోర్ ,కలకత్తా మొదలైన ప్రాంతాలనించి స్వదేశీ వస్తువులను తెప్పించేదామె. ఆంధ్ర స్టేట్ కాంగ్రెస్,టౌన్ కాంగ్రెస్  ఎగ్జిక్యూటివ్ కమిటీమెంబర్. 18ఏళ్లు విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ మెంబర్,హరిజనహాష్టల్  మేనేజింగ్ కమిటీ, స్థానిక మహిళాసంఘంలో మెంబర్ గా ఆమె కృషి అమోఘం.1948లో రజాకార్ మూవ్మెంట్ టైంలో హైదరాబాద్ నుంచి ప్రాణాలు అరచేతపెట్టుకు వచ్చినవారికి ఆశ్రయం ఇచ్చారు.ఆశరణార్ధులకోసం అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ నెలకొల్పారు.3వేలమంది మహిళలకు ఉపాధి కల్పించారామె. మద్రాస్ మైసూర్ వైశ్యామీటింగ్స్ కి హాజరైన  సుందరమ్మ  బాల్యవివాహాలకి విరోధి.శారదాయాక్ట్ గూర్చి అందరికీ వివరించారు.ఆడపిల్లల బడిని విజయవాడలో,హృషీకేష్  లో ఆశ్రమాన్ని ఏర్పాటుచేసిన ఆమెకు భర్త అండదండ దండిగా లభించడం విశేషం.దుల్ల వెంకట రమణమ్మ 1900లో తెనాలిలో పుట్టారు.తల్లిదండ్రులు వెంకట సుబ్బమ్మ,  కొమ్మూరు సాంబశివరావు గార్లు.ఆమె ప్రసిద్ధ రచయిత  చలం సోదరి.7వక్లాస్ దాకా చదివిన ఆమె న్యూస్ పేపర్స్ సాహిత్యంచదివారు.బందరువాసి దుల్ల పట్టాభిరామయ్య ఆమె భర్త. ఆయన అధ్యాపకుడు.ఖద్దరు ధారణ తోపాటు మహిళలందరికీ నూలు వడకటం    విరాళాలు సేకరించి గాంధీ సిద్ధాంతాన్ని ప్రచారం చేయటం,1939లోమహిళా సేవామండలిని ఏర్పర్చారు.4అణాల మెంబర్ షిప్ ఫీజు 10 మంది సభ్యులతో మొదలైంది.ఇంటింటి నుంచి పుస్తకాల సేకరణ తో లైబ్రరీ ఏర్పాటైంది.టైలరింగ్ ఏర్పాటుచేసింది. డ్రామా ప్రదర్శన తో ధనం సేకరించి రీడింగ్ రూం,లైబ్రరీ,హిందీ క్లాసులు,బాలానందం నడిపారు.హరిజన బస్తీల కెళ్లి పిల్లల్ని బడికి పంపమని ప్రోత్సాహించారు.గళమెత్తి కమ్మగా జాతీయ గీతాలుపాడేదామె.కానీ మహిళామండలి నడపడం కష్టమైంది. అందుకోమార్గం కనిపెట్టినదామె.ప్రతి ప్రతిసభ్యుడు రెండు కండెలనూలు ఇస్తే ఫీజుకింద, ఖాదీ కమిటీవారు తీసుకుని డబ్బు ఇచ్చేవారు.దుర్గాబాయ్ దేశ్ముఖ్ సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఛైర్మన్ గా 5వేలు శాంక్షన్ చేశారు భవననిర్మాణం కోసం.ప్రతి ఏడాది వార్షికోత్సవ సంబరాలు,విరాళాలతో  మండలి ప్రతి ఏడాది 2వేలు గ్రాంట్ తో1955నుంచి చురుకుగా నడిచింది.రమణమ్మ జైలుకెళ్లకపోయినా పికెటింగ్ ఇంకా ప్రభాతభేరీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.20మే 1988లో ఆమె మరణించారు.విద్యాదేవి ఓంప్రకాష్  అమ్మ నాన్నలు దుల్ల వెంకట రమణమ్మ, పట్టాభిరామయ్య. కమ్మని గాత్రంతో బాపూ పై పాటలు,భజన్స్ పాడుతూ తల్లిదండ్రుల ప్రభావంతో సేవాగ్రాంలో ఓఏడాది ఉందామె.ఆమె లాయర్.సేవాగ్రాంనుంచి సీతానగరం వచ్చి కస్తూర్బా ట్రస్ట్ లో కుటీరపరిశ్రమలలో శిక్షణ ఇచ్చారు.సంచాలిక గా ఉన్న విద్యాదేవి ఆర్గనైజర్ గా ఎన్నో పల్లెల్లో గ్రామ సేవికా సెంటర్స్ ఏర్పాటుచేసింది.1947లో గాంధీజీని కలిసిన ఆమె బేసిక్ ఎడ్యుకేషన్ బోర్డ్ మెంబర్ గా ఉన్నారు.వినోబాజీతో కల్సి బీహార్ లో పాదయాత్ర చేశారు.అప్పుడే ఓంప్రకాష్ గుప్తా తో పెళ్లయినతర్వాత 1954లోగయజిల్లాలో సుఖొదెవెరా ప్రాంతంలో ఆశ్రమంపెట్టి వయోజనవిద్య, సర్వోదయప్రచారం చేశారు.అంబర్ చర్ఖా స్కూల్ నడిపారు.1964లో హైదరాబాద్ లో ఫిర్జాదిగూడా లో స్థిరపడి 1971లో కస్తూర్బా ట్రస్ట్ లో(ఆంధ్ర బ్రాంచ్) లోపనిచేశారు.గాంధీ స్మారక నిధి,సర్వోదయమండలి, ప్రొహిబిషన్ కమిటీ,కస్తూర్బాగాంధీ సెంటినరీ సెలబ్రేషన్స్ కమిటీలో మెంబర్.మంచి వక్త, రచయిత్రి,గాయని .గాంధీ వక్త జయప్రకాష్ నారాయణ్ శిష్యురాలిగా రోజూ 16మైళ్లు మండుటెండలో నడిచేవారు విద్యాదేవి.తన కుటుంబంపై బిపిన్ చంద్ర పాల్, డాక్టర్  అనీబిసెంట్ ప్రభావం బాగా పడటంతో తాను జాతీయ స్థాయికి ఎదిగానని చెప్పేవారామె🌷

కామెంట్‌లు