65వ సర్గ శ్రీమద్రామాయణము బాలకాండము : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
ఓ బ్రహ్మ అతనికి కోపం తెప్పించుటకు 
మేము ఎన్నో విధాలుగా ప్రయత్నించాము 
అతనిలో ఇసుమంత కోపము కూడా లేదు 
అతడు తపస్సు అలానే సాగిస్తే 

ఈ ముల్లోకములను నశింపజేయును 
దిక్కులన్నీ అంధకారముతో నిండి 
సముద్రములు కల్లోలితమగుచున్నవి 
పర్వతాలన్ని శిథిలమగు చున్నవి 

భూమి అంతయు కంపిస్తుందూ
వాయువులు ప్రచండముగా వీస్తున్నాయి 
జనులంతా నాస్తికులగుచున్నారు
ఓ బ్రహ్మ మాకేమి చేయాలో తోచకున్నది

ఆ ముని మహా తేజస్సు ముందు 
సూర్యుడు వేలవేల బోతున్నాడు 
ఓ బ్రహ్మ! పూజ్యుడైనవిశ్వామిత్రమహార్షి
అగ్ని తూల్యుడై అంతా నశింపజేయును 

అలాజరగకుండతడిని గ్రహించుము 
అతడు దేవరాజ్యమునే గోరును
అందుకు సమ్మతించి ఇచ్చివేయుము
బ్రహ్మ,దేవతలతో ముని వద్దకొచ్చినాడు


కామెంట్‌లు