సెల్లుకు బానిస: - డీకొండ ధరణిశ్రీ -7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -జిల్లా:సిద్ధిపేట -9704865816.
 ఎర్రవళ్లి గ్రామంలో నవీన్,సురేష్ మంచి స్నేహితులు.నవీన్ ప్రభుత్వ పాఠశాలలో చదివి క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు.సురేష్  ప్రైవేట్ పాఠశాలకు వెళ్లి ఎప్పటికీ తరగతులో వెనుకబడి పోయేవాడు.ఒకరోజు సురేష్ వాళ్ళ ఇంటికి నవీన్ వస్తాడు.సురేష్ నీకు పరీక్షలో ఎన్నిమార్కులు వచ్చినాయిరా!
ఒరేయ్ నవీన్! గట్టిగా అరవకురా!మా అమ్మ నాన్నలు వింటారు.నన్ను కోప్పడుతారు. అప్పుడు సురేష్ మెల్లగా ఇంటి వెనకాలకు తీసుకెళ్లి ఇలా అంటాడు.నేను పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను.అందుకే బాధగా ఉందిరా!
మరి నీవురా!నేనా..రా.. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినాను. రోజునీవు చదువుకోలేదా.. రా అని నవీను అంటాడు.లేదురా అశ్రద్ధ చేశాను.అయితే రోజు మా ఇంటికి రారా మంచిగా నువ్వు నేను కలిసి చదువుకుందాం అని నవీన్ అంటాడు.అర్థం కాని విషయాలు నేను చెప్తాను అని అంటాడు.సరేరా నవీన్!
నేను రేపటినుండి మీ ఇంటికి వస్తారా! పక్క పక్కనే కూర్చొని కలిసి చదువుకుందాం రా అని సురేషు అంటాడు.
సరే రారా అని నవీన్ ఇంటికి వెళతాడు.సురేష్ కొద్దిసేపటికి నవీన్ ఇంటికి వచ్చి చదువుకుందామని పుస్తకాలు తెరిచి చదువుమొదలు పెడతారు.సురేషు వాళ్ళ నాన్నగారి ఫోన్ తీసుకొచ్చి పుస్తకంలో పెట్టి చూస్తున్నాడు.
ఒరేయ్ సురేష్ పోన్ చూడద్దురా!కండ్లు పోతాయి! మరియు చదువు మీద ధ్యాస వుండదు.అందుకే నువ్వు పరీక్షలలో ఫెయిల్ అయితున్నావురా? 
ఎప్పుడు ఫోన్ చూడొద్దు రా నేను చెప్పినట్టు వినురా అని నవీను అంటాడు.
సురేష్ ఇలా అన్నాడు.సరే లేరా మరి నాకు ఫోన్ చూడంది మనసుకు పట్టదురా! అందుకే నేను ఫోన్ చూస్తారా అని సురేష్ అంటాడు.ఒరేయ్ నేను నీకు అర్థం కానీ విషయాలన్నీ చెప్తాను.ఫోన్ మాత్రంచూడనని నామీద  ఒట్టువేయిరా అని నవీన్ అంటాడు.ఒద్దురా అలా ఒట్టు వేయించుకోవద్దురా! అని సురేష్ అంటాడు.ఫోన్ బంద్ చేస్తా నాకు అర్ధంకాని విషయాలు చెప్పురా! అని సురేషు అంటాడు.కాసేపు ఇద్దరు కలిసి ఒక చెట్టు కింద కూర్చొని హాయిగా నిశ్శబ్దంగా చదువుకుంటారు.అప్పుడు నవీను వాళ్ళ అమ్మానాన్నలు పిలిచారు.నవీన్ నువ్వు ఇంటికి వెళ్తున్నావురా! అవున్రా నేను మళ్ళీ వస్తాను. నువ్వు ఇక్కడే ఉండి చదువుకో!అని వెళ్లి పోతాడు.ఇలా చాలా రోజులు నవీన్ చెప్పినట్లుగా వింటాడు. ఇద్దరూ పదో తరగతి పరీక్షలు రాయడానికి వెళ్లారు.ఇద్దరు కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు.నవీన్ పుణ్యమా అని నేను ప్రథమ శ్రేణిలో పాసైనాను. అప్పుడు సురేష్ నవీన్ వద్దకు వచ్చి చాలా చాలా ధన్యవాదాలు రా నువ్వు చెప్పినట్లుగా నేను చదువుకున్నాను మా అమ్మానాన్నలు నన్ను మెచ్చుకున్నారని సురేషు అంటాడు.అప్పుడు నవీన్ సరేలేరా!
మొత్తం మీద మనం ఇదే విధంగా కష్టపడి ఇంకా పై స్థాయిలో బాగా చదువుకోవాలి.
మనిద్దరం కూడా మంచి ఉద్యోగాలు తెచ్చుకుందాం రా అని నవీన్ అంటాడు.ఔనురా! ఇప్పటినుంచి మనిద్దరం ఇదేవిధంగా చదువుకుందామని 
చదువుల తల్లి సరస్వతీ దేవిమీద ఒట్టుపెట్టుకుంటారు.
చదువులో పైకి వస్తారు.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
మొల్ల విరులు;- .బి. అరుణ- పి జి టి - తెలుగు
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం