చదివే జీవితానికి వెలుగు
చదవకపోతే జీవితమంతా బుగులే
చదువు మీ బుర్రకు చెపుతుంది బుద్ధి
చదవకపోతే అవుతారు మొద్దు
చదువు నేర్పిస్తుంది గొప్ప గుణాలు
చదువుతే ఇస్తుంది ఎన్నో బహుమతులు
చదువుతే అవుతారు నింగిలో చుక్కలు
చదవకపోతే ఔతారు పనికిరాని కుక్కలు
విత్తనం పెడితేనే అక్కడ
పెరిగేవిమంచిమొక్కలు
ఎక్కడ బడితే అక్కడ మొలిచేవి కలుపు మొక్కలు
అమ్మానాన్నల మాటవింటారు
మంచి పిల్లలు, పెద్దలమాటలు వినని వారు పిడుగులు
చదువు ఇస్తుంది సమస్కారం
చదువు లేకపోతే జీవితం వెటకారం
ఇష్టపడిచదువుతేనే
ఈ భూమిపై విలువ
చదివే మనకు అన్నింటికీ మూలం
నేటి కాలంలో చదివే మనకు గౌరవం
చదువుదాం చదువుదాం సమాజంలో వెలుగుదాం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి