న్యాయాలు -68
చర్విత చర్వణ న్యాయము
*****
చర్విత అంటే నమల బడినది,కొరకబడినది,తినబడినది లేదా రుచి చూడబడినది అనే అర్థాలు ఉన్నాయి.
చర్వణం అంటే నమలుట,తినుట,ఆస్వాదం చేయుట,ఆనందం నొందుట అనే అర్థాలు ఉన్నాయి.
చర్విత చర్వణం అంటే నమిలిన దానినే మళ్ళీ నమలడం. చేసిన పనినే మరల మరల చేయడం అని అర్థం.
నమిలిందే మరల నమిలినట్లు . చేసిందే ఉపయోగం లేకున్నా మళ్ళీ చేయడాన్ని ఉద్దేశించి ఈ చర్విత చర్వణ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
ఆవు, గేదె లాంటి జంతువులు మేత మేసేటప్పుడు గబగబా మేస్తాయి.ఆ తర్వాత నింపాదిగా నోట్లోకి తెచ్చుకుని నెమరు వేస్తాయి. అలా చేయడాన్ని చర్విత చర్వణం అంటారు.అది పశువులకు సంబంధించినది.
కానీ కొందరు చేసిందే చేస్తూ, చెప్పిందే చెబుతూ,రాసిందే రాస్తూ వుంటారు. అందులో కొత్తదనం ఏమీ ఉండదు.అలా చేయడం వల్ల ఒనగూరే అదనపు లాభం ఏమీ వుండదు. చూసే వారికి విసుగు, చేసేవారికి శ్రమ తప్ప.
అలాంటి సందర్భాలు కొన్ని ఉంటుంటాయి.కొందరి ఉపన్యాసాలు వింటుంటాం. వాళ్ళు ఎక్కడ మాట్లాడినా ఒకే విషయం,ఏ సందర్భంలో నైనా ,ఏ వేదిక మీదనైనా సరే చెప్పిందే చెబుతూ ఉంటారు.సమయం సందర్భం,ప్రస్తుతమా, అప్రస్తుతమా... ఏమీ చూసుకోరు. ఇలా చేసేవారిని ఉద్దేశించి తెలుగులో ఓ సామెత అంటుంటారు "పాడిందే పాడరా...!"అన్నట్లుందని.
దీనికి ఓ చిన్న సరదా కథ ఉంది. ఓ పిల్లవాడికి ఆవు గురించిన అంతో ఇంతో తెలుసు తప్ప మరో విషయం తెలియదు. అదెలా అంటే 'ఆవుకు నాలుగు కాళ్ళు ఉంటాయి,తోక వుంటుంది. ఆవు గడ్డి మేస్తుంది.ఆవు సాధు జంతువు.ఆవు పాలు ఆరోగ్యానికి మంచివి'.ఇలా అన్న మాట.అది తప్ప ఇంకేం రాదు.
ఒక సారి వాళ్ళ గురువు గారు ''పిల్లలూ విమానం గురించి రాయండి" అన్నారట. ఆ పిల్లవాడు వీర లెవల్లో రాశాడు ఆకాశంలో విమానం పోతా వుంది. అందులోంచి కిందకు చూస్తే ఓ పెద్ద మైదానం కనిపించింది.అందులో గడ్డి మేస్తూ ఓ అవు కనిపించింది.ఆ ఆవుకు నాలుగు కాళ్ళు... తనకు తెలిసిన ఆ ఒక్క విషయాన్నే మరల రాశాడు తప్ప ,అడిగిన విమానం గురించి మాత్రం రాయలేదు. ఇలా ఏ అంశం ఇచ్చినా అటూ ఇటూ తిప్పి చివరికి ఆవు గురించే రాసేవాడు. ఇదిగో ఇలా విసిగించడాన్నే చర్విత చర్వణం న్యాయముగా చెప్పుకోవచ్చు.
అంతే కానీ గతాన్ని గుర్తు చేసుకోవడం, వివిధ విషయాలకు సంబంధించిన పాఠాలను మరోసారి పునశ్చరణ చేసుకోవడం కాదన్న మాట.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి