ఆదర్శం : చిత్తారి వైష్ణవి-8 వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇబ్రహీం నగర్-చరవాణి సంఖ్య: 6305727895
 ఇబ్రహీం నగర్ అనే గ్రామంలో ఇద్దరు అన్నాచెల్లెళ్లు ఉండేవాళ్ళు. ఒకరోజు బడికి వెళ్ళగా ప్రైవేట్ బడి సార్లు వచ్చి "అమ్మా! నీ పేరేంటి? నువ్వు ఏ బడికి వెళ్తున్నావ్?  అని అడిగిండ్రు. " మా అన్న నిఖిల్, నేను" సర్కార్ బడికి వెళ్తున్నామని లత అన్నది. సార్లు వెళ్ళకండి మంచిగా మా పాఠశాలకు రండి మేం మంచిగా చెబుతున్నాం మీరు కూడా రండి ." మీరు బస్సులో వస్తారు బస్సులో వెళ్తారు. అని చెప్పిండ్రు.
" పిల్లలు మేము అసలే రాము. మా ప్రభుత్వ పాఠశాలను విడిచి మరెక్కడికి రాము" అని అన్నారు. పిల్లలు. కావాలంటే మేము కూడా ఇంటింటికి తిరిగి మా ప్రభుత్వ పాఠశాలలో మరింత పిల్లల సంఖ్య పెంచుతామని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే పిల్లల వద్దకు వెళ్లి మా ప్రభుత్వ పాఠశాలకు రండి అని సవినయంగా కోరారు. అర్థమయ్యేలా చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు నోట్ బుక్స్ మధ్యాహ్న భోజనము ఏకరూప దుస్తులు ఎన్నో విలువైన వస్తువులు ప్రభుత్వం సరఫరా చేస్తున్నది వాటిని తీసుకోకపోతే దుర్వినియోగం చేసినట్లు అని అర్థమయ్యేటట్లు చెప్పారు. అంతేకాకుండా సార్లు బోధించే నైపుణ్యము మా నుంచి వారు ఎలా ఆశిస్తున్నారో మేము ఎలా ఆచరిస్తున్నాము ఉదాహరణలతో సహా చెప్పారు. గణితం ఇంగ్లీష్ భౌతిక శాస్త్రం లాంటి సబ్జెక్టులలో పోటీ పెట్టుకుని వీరే నెగ్గారు. అప్పుడు ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ పాఠశాలకు వెళ్లాలని అనిపించింది.  ఇంటి ఇంటికి తిరిగి పిల్లలు ఇద్దరు కలిసి 20 మంది ఉన్న పాఠశాలను 40 మందిని పెంచారు. వాళ్ళ తెలివికి ఊరి సర్పంచ్ మరియు సార్లు మెచ్చుకొని వాళ్లకు బహుమతులు ఇచ్చి సన్మానం చేశారు. వాళ్ల తల్లిదండ్రులు ఎంతో ఆనందంలో ఉన్నారు. ప్రైవేట్ సార్లు ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయారు. స్వాతంత్రం దినోత్సవం రోజు అందరికీ అర్థమయ్యే విధంగా పాఠశాల గొప్పతనం గురించి తన ఉపన్యాసంలో చెప్పింది. లత మా అమ్మానాన్న అన్నా లేకపోతే నేను చదివే దాన్నే కాకపోతుండే. ఎందుకంటే ఇంటికాడ తల్లిదండ్రులు; అన్న బుద్ధులు నేర్పి బడికి తోలారు. బడిలో ఉపాధ్యాయులు పాఠాలు,  విద్యాబుద్ధులు నేర్పారు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలోనే చదవాలి అని అన్నది లత. ఇబ్రహీం నగర్ లో ఏ ఒక్క ప్రైవేట్ బస్సు రావద్దు అని మా అన్నయ్య నిఖిల్ చెప్పిన ఆలోచనతోటే ఇదంతా జరిగింది. అన్నాచెల్లెల్లు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ కష్టపడి తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చారు. అన్న డాక్టర్ అయిండు.  చెల్లె పోలీస్ అయ్యింది. వాళ్లు తెలివితో చదివి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకొని తల్లిదండ్రులకు నీ గ్రామానికి ప్రజలకి వీలైనంత సేవ చేస్తూ గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నారు. వాళ్ళ అమ్మా రమా నాన్న రంగయ్యలు వ్యవసాయ చేస్తారు. నాన్న కష్టపడి చదివించిందేగాక మేము నాన్నని కష్టపడనీయం అని పిల్లలు తల్లిదండ్రులని ఎటువెళ్ల నివ్వకుండా  అన్ని సౌకర్యాలు కల్పించారు. వాళ్ల డ్యూటీ వాళ్లు చేస్తున్నారు. తల్లిదండ్రులని సంతోషపరిచారు.
చదువుతూ వారు వృద్ధిలోకి  వచ్చారు పాఠశాలను అభివృద్ధిలోకి తెచ్చారు గ్రామం అభివృద్ధి కావడానికి సహాయం చేస్తున్నారు అందువల్ల ఆ గ్రామంలో చదివి వృద్ధిలోకి వచ్చిన వారి పేర్లలో ముందుగా వారినే తలుస్తారు.s


కామెంట్‌లు