మా ఊరు: - ఆ.రేవతి -8వ తరగతి-మం: చిన్నకోడూర్ -జిల్లా: సిద్దిపేట
 సిరులు పొంగిన ఊరు రా
పాడిపంటల నిలయమురా
పూల వనములతో పొంగియుండును
కన్న తల్లిగా కలిసి ఉండును
జామ తోటలు జాజి పువ్వులు
కూరగాయలు కోరినన్నియు
పాడిపంటలు వలసినంతయు
వర్తకమున భాగ్య సంపద
విందు చేసే ప్రేమ పాటలు
కన్నతల్లి వంటి ప్రేమ మాటలు
కోతికొమ్మచ్చిఆటలు
అమ్మలక్కల ముచ్చట్లు 
అక్కాచెల్లెళ్ల ఆటలు
కోకిలమ్మల పాటలు
అన్నాచెల్లెళ్ల చిలిపి చేష్టలు
విద్యాభివృద్ధికి వివేకుల ముచ్చట్లు
అమ్మ కొడుకుల ప్రేమలు
మల్లెపూల తోటలు
నిండి యున్నవి దండిగా
గలగల తో కాల్వజలములు
అమ్మలాంటి పాఠశాల
పచ్చని చెట్ల కళకళలతో
మరపురానిది మా ఊరు

కామెంట్‌లు