ఉపకారికి---!: - డా పివిఎల్ సుబ్బారావు, విజయనగరం 94410 58797.
ఊరికి ఉపకారికే ,
ఉపకారం ఆరుదు !

నెపం వెతికి . 
అపకారం కొందరు !

గాయం కెలికి ,
కులికే వారు మరి కొందరు! 

అసలు అందరూ కలిసి,
వాడిని బతకనీయరు !

ఇక అపకారికి ఉపకారమా?
 చేయరాడు ఒక్కడు!

నీవు మంచి వాడిలా బతకొద్దు! 

నీ బతుకు కత్తి పట్టి సాగని! 

వాడిని వాడిలా వాడిదారి పోనీ! 

 ఆరోపిస్తావు ఆప్రయోజకుడని !

 వాదించడు మరి అనడు కాదని!

పని కట్టుకుని ఏడిపిస్తావు,
 ఎందుకు?

 మాటల ఉచ్చు, బిగిస్తున్నావు,
ఎఃదుకు? 

బయటకీడ్చి రచ్చ చేస్తున్నావు, 
ఎందుకు?

చర్చనీయాంశం చేసి,
బురద జల్లుతావెందుకు!

మనిషికి మనిషితోనే భయం! 

అడవి మృగాలే కాస్త నయం! 

పాలపడితే చావు ఖాయం! 

మనిషే మనిషిని బతకనివ్వడు! 

మహారాజా! అంటే ,
మరి రెండు వడ్డిస్తున్నాడు! 
_________


కామెంట్‌లు